డీజే టిల్లు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ నేహా శెట్టి. ఇటీవలే బెదురులంక 2012 సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. కానీ ఈ మూవీ అంతగా జనాల్లోకి మాత్రం వెళ్లలేకపోయింది. ఆ తర్వాత రూల్స్ రంజాన్ సినిమాలో నటించిన ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో నేహా ఖాతాలో మరో డిజాస్టర్ చేరింది. కానీ ముద్దుగుమ్మకు మాత్రం అవకాశాలు తగ్గడం లేదు. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం విశ్వక్ సేన్ జోడిగా గ్యాంగ్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తుంది.