- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Season 7 Telugu: Will Ashwini Sree be eliminated this week.?
Ashwini Sree : ఈ వారం బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇదేనా.. హౌస్ నుంచి అశ్విని అవుట్.?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత చాలా మంది మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంటుంటారు. సినిమాల్లో నటించినప్పటికీ చాలా మంది ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవుతూ ఉంటారు అలాంటి వారిలో అశ్విని శ్రీ ఒకరు.
Updated on: Oct 28, 2023 | 8:21 AM

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత చాలా మంది మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంటుంటారు. సినిమాల్లో నటించినప్పటికీ చాలా మంది ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవుతూ ఉంటారు అలాంటి వారిలో అశ్విని శ్రీ ఒకరు.

ఈ భామ టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది.

ఇక సోషల్ మీడియాలో ఈ హాట్ భామకు మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే బిగ్ బాస్ హౌస్ లో తన స్ట్రాటజీతో గేమ్ ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అశ్విని.

హౌస్ లో అందాల భామ ఎవరు అంటే ఇప్పుడు అశ్విని పేరే చెప్తున్నారు. ఆ రేంజ్ లో గ్లామర్ తో కవ్విస్తోంది ఈ హాట్ బ్యూటీ.

ఇక ఈ చిన్నది ఈ వారం డేంజర్ జోన్ లో ఉంది. గతకొద్ది రోజులుగా అశ్విని ఆట అంతగా ఆకట్టుకోవడం లేదు. దాంతో ఆమెకు ఓట్లు కూడా అంతగా రావడం లేదు. ఈ వారం కూడా నామినేషన్స్ లో ఉన్న అశ్విని ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.