- Telugu News Photo Gallery Cinema photos Krithi Shetty shares gorgeous clicks in blue dress photos goes vrial telugu cinema news
Krithi Shetty: నెట్టింట సైలెంట్ అయిన బేబమ్మ.. ఇన్నాళ్లకు మళ్లీ అందంతో మాయ చేసింది..
తొలి సినిమాతోనే తెలుగు అడియన్స్ హృదయాలను దొచేసింది హీరోయిన్ కృతి శెట్టి. ఉప్పెనలా ఇండస్ట్రీలోకి దూసుకువచ్చి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. డైరెక్టర్ బుచ్చిబాబు రూపొందించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి ఉప్పెన తర్వాత కృతికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది బేబమ్మ. అందులో బంగర్రాజు, శ్యామ్ సింగరాయ్ చిత్రాలు మాత్రమే హిట్ అయ్యాయి.
Updated on: Nov 16, 2023 | 9:57 PM

తొలి సినిమాతోనే తెలుగు అడియన్స్ హృదయాలను దొచేసింది హీరోయిన్ కృతి శెట్టి. ఉప్పెనలా ఇండస్ట్రీలోకి దూసుకువచ్చి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. డైరెక్టర్ బుచ్చిబాబు రూపొందించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

నిజానికి ఉప్పెన తర్వాత కృతికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది బేబమ్మ. అందులో బంగర్రాజు, శ్యామ్ సింగరాయ్ చిత్రాలు మాత్రమే హిట్ అయ్యాయి.

ఆతర్వాత కృతి నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయి. చివరగా బేబమ్మ.. అక్కినేని నాగచైతన్య నటించిన కస్టడీ సినిమాలో నటించింది. ఈ సినిమా సైతం కృతికి నిరాశే మిగిల్చింది.

ప్రస్తుతం కృతి చేతిలో కేవలం రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయి. అందులో శర్వానంద్ సరసన సినిమా ఒకటి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. అలాగే మలయాళంలో పాన్ ఇండియా సినిమా చేస్తుంది.

ఇవి కాకుండా తెలుగులో కృతి చేతిలో మరో సినిమా లేదు. అటు ఇండస్ట్రీలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యింది కృతి. అప్పుడప్పుడు కొన్ని ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా బేబమ్మ షేర్ చేసిన దీపావళి లుక్స్ తెగ వైరలవుతున్నాయి.

నెట్టింట సైలెంట్ అయిన బేబమ్మ.. ఇన్నాళ్లకు మళ్లీ అందంతో మాయ చేసింది..




