- Telugu News Photo Gallery Cinema photos Know This Heroine Did 7 Movies In Telugu, But Not Get So Much Craze , Her Name Is Shanvi Meghana
Tollywood: అబ్బో అమ్మడు.. అందంలో అప్సరస.. చేసిన సినిమాలన్నీ హిట్సే.. అయినా పట్టించుకోని టాలీవుడ్..
సినిమా ప్రపంచంలో వరుస హిట్స్ అందుకున్నప్పటికీ సరైన క్రేజ్ రానీ తారలు చాలా మంది ఉన్నారు. కానీ కొందరు మాత్రం ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతుంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం తెలుగులో వరుస సినిమాల్లో నటించింది. ఆమె చేసిన సినిమాలన్నీ హిట్సే. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు.
Updated on: Aug 29, 2025 | 8:45 PM

తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. ఇటీవలే తమిళంలో ఆమె నటించిన చిన్న సినిమా బాక్సాఫీల్ వద్ద సంచలనం సృష్టించింది. దీంతో ఈ అమ్మడు పేరు మారుమోగింది. అయినప్పటికీ తెలుగులో మాత్రం ఆఫర్స్ నిల్లు.

ఈ హీరోయిన్ పేరు శాన్వీ మేఘన. 1998 సెప్టెంబర్ 12న హైదరాబాద్ లో జన్మించిన శాన్వీ మేఘన.. 2019లో సైరా నరసింహా రెడ్డి సినిమాతో సినీప్రయాణం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత పిట్ట కథలు, బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్, పుష్పక విమానం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాల్లో నటించింది.

పుష్పక విమానం సినిమాలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. తెలుగులో మొత్తం ఆరు సినిమాల్లో నటించింది. అన్నీ సూపర్ హిట్సే. కానీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం రాలేదు. దీంతో కోలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ అమ్మడు అవకాశాలు అందుకుంది.

ఇటీవలే కోలీవుడ్ నటుడు మణికందన్ జోడిగా ఆమె నటించిన కుటుంబస్థాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ అమ్మడు పేరు మారుమోగింది. కానీ తెలుగులో ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం రాలేదు.

తెలుగులో చివరగా టుక్ టుక్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ మరో మూవీ అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్లతో మెంటలెక్కిస్తుంది ఈ వయ్యారి.




