- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress In This Photos, She Is Waiting For Telugu Movies, Her Name Is Kalyani Priyadarshan
Actress : బాక్సింగ్ బ్యూటీని గుర్తుపట్టారా.. ? స్టార్ హీరోలతో సినిమాలు.. సక్సెస్ కోసం ఎదురుచూపులు..
సాధారణంగా సినీరంగంలో నటీనటులుగా క్రేజ్ సంపాదించుకోవాలంటే.. ప్రతిభతోపాటు లుక్స్, ఫిట్నెస్ పై శ్రద్ధ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్రస్తుతం సినీతారలు తమ లుక్స్, ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. పాత్రకు తగినట్లుగా తమ శరీరాన్ని మార్చుకుంటారు. మంచి శరీరాకృతి కోసం జిమ్ లో తెగ కష్టపడుతుంటారు.
Updated on: Aug 29, 2025 | 8:22 PM

బాక్సింగ్ బ్యూటీని గుర్తుపట్టారా.. ? తెలుగులో చేసింది తక్కువ సినిమాలే.. అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోలతో మూడు సినిమాల్లో నటిస్తే అందులో ఒక్కటి మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. కానీ ఇప్పుడు మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ?

ఆమె మరెవరో కాదు.. కళ్యాణి ప్రియదర్శన్. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ మూవీ నిరాశపరిచింది. కానీ ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో ఆఫర్స్ వస్తాయని అనుకున్నారంతా.

సాయి ధరమ్ తేజ్ సరసన చిత్రలహరి సినిమాతో మెప్పించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత శర్వానంద్ జోడిగా రణరంగం అనే సినిమాలో కనిపించింది. మలయాళం సినిమాలో వరుస సినిమాలు చేస్తుంది.

లుగులో మంచి అవకాశం వస్తే చేయడానికి చేసేందుకు రెడీగా ఉంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు.. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా జిమ్ లో కష్టపడుతున్న ఫోటోలను పంచుకుంది.

తాజాగా ఈ అమ్మడు జిమ్ లో బాక్సింగ్ చేస్తున్న ఫోటోస్ పంచుకుంది. ఇప్పుడు ఈ పిక్స్ నెట్టింట ఫుల్ వైరలవుతున్నాయి. తెలుగులో ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్న ఈ బ్యూటీకి నెట్టింట క్రేజ్ మాత్రం ఎక్కువగానే ఉంది.




