హాలీవుడ్ నటిలా మారిపోయిన రకుల్.. ఫొటోలు చూస్తే గూస్ బంప్స్ పక్కా!
అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ తెలుగులో అంతగా సినిమాలు చేయకపోయినప్పటికీ,సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరినీ దోచేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ హాలీవుడ్ బ్యూటీలా రెడీ అయ్యి, తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది. మరి మీరు చూసెయ్యండి ఆఫొటోస్!
Updated on: Aug 30, 2025 | 12:49 PM

బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఇక ఈ నటి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు వెండితెరపైకి అడుగు పెట్టి తన నటన, అందంతో ఎంతో మంది మదిని దోచుకుంది. ఈ మూవీతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి వరసగా అవకాశాలు తలుపు తట్టాయి. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. వరసగా మూవీస్ చేస్తూ, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ, టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది. కానీ తర్వాత ఈ బ్యూటీకి వరసగా అవకాశాలు తగ్గడంతో టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పి బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది.

ఇక అక్కడ సినిమాలు చేస్తూ ప్రముఖ నటుడు, నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి , పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే, ఇక పెళ్లి తర్వాత ఈ బ్యూటీ సినిమాలు ఎక్కువగా చేయకపోయినప్పటికీ, బిజినెస్‌లు చూసుకుంటూ చాలా బిజీ అయిపోయింది. అలాగే సినిమాల పరంగా తన అభిమానులకు దూరం ఉన్న ఈ చిన్నది, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ తన అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటుంది.

తాజాగా ఈ బ్యూటీ ఓ కవర్ పేజీ కోసం దిగిన ఫొటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అందులో ఈ అమ్మడును చూస్తే మతి పోవాల్సిందే. అంత అందంగా, దేవక కన్యలా, మహారాణిలా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇక వీటిని చూసిన కొందరు అచ్చం హాలీవుడ్ నటిలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ ఫొటోల్లో రకుల్, బ్లాక్ సారీ, డిఫరెంట్ డిజైన్స్ తో తయారు చేసిన డ్రెసెస్, క్రౌన్ ధరించి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ ఫొటోస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.



