- Telugu News Photo Gallery Cinema photos Know RRR Movie stars and actors Educational background, some are engineers and some are 10th pass
RRR సినిమాలోని తారలు ఎంత చదువుకున్నారో తెలుసా.. కొందరు ఇంజనీర్లు, మరికొందరు కేవలం 10వ తరగతి పాస్..
SS రాజమౌళి దర్శకత్వం వహించిన RRR చిత్రంలోని నాటు-నాటు పాట చరిత్ర సృష్టించింది. నాటు-నాటు పాట 95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రంలో పనిచేసిన తారల విద్యార్హతల గురించి తెలుసుకుందాం..
Updated on: Mar 13, 2023 | 11:34 AM

ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీలో పట్టభద్రుడు.

ఇక ఈ సినిమాలో బ్రిటీష్ పాలనలో పనిచేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన రామ్ చరణ్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పట్టా పొందాడు. రామ్ చరణ్ ముంబై కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్ నుంచి యాక్టింగ్ నేర్చుకున్నాడు. రామ్ లండన్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి పట్టా పొందారు.

ఆలియా భట్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ చిత్రంలో ఆమె రామ్ చరణ్ భార్య పాత్రను పోషించారు. ఆలియా విద్యాభ్యాసం గురించి తెలుసుకోవాలని అనుకుంటే.. 10వ తరగతి వరకు మాత్రమే చదివినట్ల తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత నటనలో శిక్షణ తీసుకున్నట్లుగా సమాచారం.

ఈ చిత్రంలో విప్లవకారుడిగా, రామ్ చరణ్ తండ్రిగా నటించిన అజయ్ దేవగన్ ముంబైలోని మిథిబాయి కాలేజీలో నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

RRR చిత్రంలో విప్లవకారుడు అజయ్ దేవగన్ భార్య పాత్రను పోషించిన శ్రేయా శరణ్ ఢిల్లీ నుంచి సాహిత్యంలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు.

చిత్రం మరియు నాటు-నాటు పాటలో ముఖ్యమైన పాత్రలో కనిపించిన ఒలివియా మోరిస్ నటనలో బిఎ ఆనర్స్ పట్టా పొందారు.

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్-2023లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్(2022)కి రెండు నామినేషన్లు దక్కాయి. ఉత్తమ ఆంగ్లేతర చిత్రం విభాగంలోనూ, ఎం. ఎం. కీరవాణి స్వరపరిచిన ‘నాటు నాటు...’ పాటకిగానూ ఒరిజినల్ సాంగ్ విభాగంలోనూ ఈ చిత్రం నామినేట్ అయ్యింది. ఆయన ఏలూరులోని CRR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యాడు.




