- Telugu News Photo Gallery Cinema photos Know Important Information About Anant Ambani And Radhika Merchant's Wedding Food
Anant Ambani-Radhika Merchant: అనంత్ అంబానీ పెళ్ళిలో అదిరిపోయే వంటకాలు.. మూడు రోజుల్లో 2500 రకాలు
ఈ వివాహ వేడుకకు చాలా మంది అతిధులు హాజరుకానున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఈ రాయల్ వెడ్డింగ్ జరుగుతోంది. విశేషమేమిటంటే ఈ పెళ్లి మూడు రోజుల పాటు జరగనుంది. ఈ వివాహానికి మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ లాంటి స్టార్స్ హాజరుకానున్నారు.
Updated on: Feb 28, 2024 | 8:30 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం త్వరలోనే గ్రాండ్ గా జరగనుంది. ఈ వివాహ వేడుకకు దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ వివాహ వేడుకకు చాలా మంది అతిధులు హాజరుకానున్నారు.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఈ రాయల్ వెడ్డింగ్ జరుగుతోంది. విశేషమేమిటంటే ఈ పెళ్లి మూడు రోజుల పాటు జరగనుంది. ఈ వివాహానికి మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ లాంటి స్టార్స్ హాజరుకానున్నారు.

ప్రత్యేకంగా ఈ సందర్భంగా అతిథులకు భోజనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. మూడు రోజుల్లో 2500 వంటకాలను అతిథులకు అందించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు. నివేదిక ప్రకారం పెళ్లిలో పాల్గొనే అతిథుల నుంచి కొన్ని స్పెషల్ ఆర్డర్స్ ముందుగానే అడిగారట.

25 మంది సైఫ్‌తో కూడిన ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ వివాహ వేడుకలో ఇండోరి వంటకాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. అతిథులకు అన్ని రకాల ఆహారం అందుబాటులో ఉండనున్నాయి. అల్పాహారంలో 70 ఐటమ్స్ ఉంటాయి. మధ్యాహ్న భోజనంలో 250, రాత్రి భోజనంలో 250 వంటకాలు ఉంటాయని తెలుస్తోంది.

ప్రతిసారీ అతిథులకు వేర్వేరు వంటకాలు వడ్డిస్తారు. అతిథుల కోసం ప్రత్యేకంగా స్నాక్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి గత కొన్ని రోజులుగా సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం మార్చి 1 నుంచి 3 వరకు జరగనుంది. ఈ వివాహ వేడుకకు 1000 మంది ప్రత్యేక అతిథులు హాజరుకానున్నారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు.





























