Actress Sneha: ఒక్కసారి కట్టిన చీరను మళ్లీ ముట్టుకోనంటున్న స్నేహ.. కారణం ఏంటో తెలుసా..
హీరోయిన్ స్నేహ.. ఒకప్పుడు యూత్ ఫేవరేట్ హీరోయిన్. అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను దోచేసింది. అప్పట్లో స్నేహ యాక్టింగ్ అంటే ఫ్యామిలీ అడియన్స్ సైతం తెగ ఇష్టపడ్డారు. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ రాణిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ వైరలవుతున్నాయి.
Updated on: Jan 25, 2025 | 4:09 PM

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సంప్రదాయ పద్దతిలో కనిపిస్తూనే బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

తొలి వలపు సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది స్నేహ. ఆ తర్వాత తెలుగులో రాధ గోపాలం, ప్రియమైన నీకు, ఏవండోయ్ శ్రీవారు, శ్రీరామదాసు, రాజన్న వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

తమిళ్ హీరో ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్నేహ.. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యింది. వీరికి బాబు, పాప ఉన్నారు. కొన్నేళ్ల క్రితం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన స్నేహ.. హీరోహీరోయిన్లకు అక్కగా, వదిన పాత్రలలో నటిస్తుంది.

ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ పోషిస్తూ మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్న స్నేహ. అటు సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

గతంలో ఓ మ్యాగజైన్ స్నేహ గురించి ఓ న్యూస్ రాసిందట. ఆమె ఎప్పుడూ ధరించిన దుస్తులనే ధరిస్తుందని.. ఆమె ధరించేందుకు వేరే బట్టలు లేవని రాసిందట. అలా తన దుస్తులపై అనేక విమర్శలు వచ్చాయట.

దీంతో అప్పటి నుంచి తాను ఒకసారి ధరించిన దుస్తులను మరోసారి ధరించనని తెలిపింది. ప్రస్తుతం స్నేహ చీరల వ్యాపారంలో రాణిస్తుంది. చెన్నైలో స్నేహాలయం పేరుతో చీరల షాపింగ్ మాల్ సైతం ఓపెన్ చేసింది.




