- Telugu News Photo Gallery Cinema photos Know About Nitanshi Goel, Who is Acted In Laapataa Ladies Movie as Phool Kumari Role
Nitanshi Goel: ‘లాపతా లేడీస్’ మూవీలో ఫూల్ కుమారిగా కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ?
2025 ఆస్కార్ అవార్డుల బరిలో మన దేశం తరుపున ఎంపికైన సినిమా 'లాపతా లేడీస్'. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారవుతారు. ఆ తర్వాత వారి జీవితాలు ఎలా సాగాయి ? అనేది సినిమా. ఇందులో ఫూల్ కుమారి పాత్రలో కనిపించింది. లాపతా లేడీస్ చిత్రంలో ఫూల్ కుమారి పాత్రలో కనిపించిన అమ్మాయి నితాన్సీ గోయల్.
Updated on: Sep 24, 2024 | 11:23 AM

2025 ఆస్కార్ అవార్డుల బరిలో మన దేశం తరుపున ఎంపికైన సినిమా 'లాపతా లేడీస్'. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారవుతారు. ఆ తర్వాత వారి జీవితాలు ఎలా సాగాయి ? అనేది సినిమా. ఇందులో ఫూల్ కుమారి పాత్రలో కనిపించింది.

లాపతా లేడీస్ చిత్రంలో ఫూల్ కుమారి పాత్రలో కనిపించిన అమ్మాయి నితాన్సీ గోయల్. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన ఈ మూవీలో అందం, అమాయకత్వం, అద్భుతమైన నటనతో కోట్లాది ప్రజల హృదయాలను కొల్లగొట్టింది నితాన్సీ గోయల్.

ఈ సినిమాలో నటిస్తున్నప్పటికీ నితాన్సీ వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. ఆ సమయంలో ఆమె 11వ తరగతి చదువుకుంటుంది. లాపతా లేడీస్ సినిమా కోసం చదువును కూడా పక్కన పెట్టిసింది. నితాన్సి ప్రస్తుతం 12వ తరగతి చదువుకుంటుంది.

లాపతా లేడీస్ చిత్రంలో అమాయనమైన నటనతో ప్రేక్షకుల మనసు దొచుకున్న నితాన్సీకి ప్రస్తుతం ఇన్ స్టాలో 10.8 మిలయన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంతకు ముందు థాప్కీ ప్యార్ కీ, కర్మఫల్ దాతా శని, ఎంఎస్ ధోనీ చ, ఇందు సర్కార్, ఇన్సైడ్ ఎడ్జ్ చిత్రాల్లో నటించింది.

లాపతా లేడీస్ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించింది నితాన్సి. ఈ మూవీ తర్వాత మైదాన్ చిత్రంలో కనిపించింది. ప్ర్సుతతం నితాన్సీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన లాపతా లేడీస్ మూవీ ఆస్కార్ బరిలో నిలిచింది.




