- Telugu News Photo Gallery Cinema photos Keerthy Suresh with her husband latest photos goes viral on social media
Keerthy Suresh: లైఫ్ ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్.. వైరల్ అవుతున్న ఫోటోస్
కీర్తి సురేష్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతారా..? లేదంటే పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకుంటారా..? ఎందుకని ఈమె ఆఫ్టర్ మ్యారేజ్ ఒక్క ప్రాజెక్ట్ కూడా సైన్ చేయలేదు..? కావాలనే బ్రేక్ తీసుకుంటున్నారా లేదంటే నటనకు స్వస్తి చెప్పాలనుకుంటున్నారా..? కీర్తి సురేష్ కెరీర్‌కు ఈ బ్రేక్ ఇంకా ఎన్నాళ్లు ఉండబోతుంది..?
Updated on: Jan 31, 2025 | 10:10 PM

హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా కీర్తి సురేష్‌కు మంచి గుర్తింపే ఉంది. మరీ ముఖ్యంగా మహానటి తర్వాత కీర్తికి ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్ అలా సెట్ అయిపోయారు. ఆమె ఏ సినిమా చేసినా.. ఫలితంతో సంబంధం లేకుండా తన పాత్రకు న్యాయం చేసారు.

పైగా ఈ మధ్యే గ్లామర్ డోస్ కూడా పెంచేసారు కీర్తి. బేబీ జాన్ నుంచి కీర్తి సురేష్ 2.0 కనిపిస్తున్నారు. పెళ్లికి కొన్ని రోజుల ముందు చేసిన బేబీ జాన్‌లో కీర్తి గ్లామర్ షో మామూలుగా లేదు. సినిమా ఫ్లాపైనా.. కీర్తి సురేష్ గ్లామర్ మాత్రం బ్లాక్‌బస్టర్.

బాలీవుడ్‌లో అమ్మడి పేరు బాగా వినిపిస్తుందిప్పుడు. ఊ అనాలే గానీ అక్కడ్నుంచి ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి. అయితే పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకున్నారు కీర్తి. పెళ్లి తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ సైన్ చేయలేదు కీర్తిసురేష్. ప్రస్తుతానికి మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారంతే.

పైగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు భర్తతో కలిసి ఫోటోషూట్స్ చేస్తూనే ఉన్నారు కీర్తి. మొన్నామధ్య పొంగల్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్న కీర్తి.. తాజాగా మరో ఫ్యామిలీ వేడుకలో భర్త ఆంటోనీతో కలిసి చిందులేసారు. కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

ఫ్యామిలీ ఈవెంట్‌లోనూ గ్లామర్ షోలో తగ్గదే లేదన్నారు కీర్తి. ఇక సినిమాల విషయానికొస్తే.. ఎప్పుడో సైన్ చేసిన రివాల్వర్ రాణితో పాటు కన్నివేడి సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ విషయంపై కీర్తి స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.




