ఒక సినిమా స్టార్ట్ అవుతుందంటే, దాని చుట్టూ ఎన్నో విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులోనూ ఇంటర్నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్న జక్కన్న డైరక్షన్‌లో సూపర్‌స్టార్ మహేష్ చేస్తున్న సినిమా అంటే, గాసిప్స్ మామూలుగా ఉంటాయా చెప్పండి..? లేటెస్ట్ గా వైరల్ అవుతున్న విషయం... మహేష్‌కి జక్కన్న చాలా ఆంక్షలే పెట్టారన్నది. అందులో మరీ ముఖ్యంగా, 'జనాల్లో అస్తమానం కనిపించకండి... వీలైనంత వరకు ప్రైవసీ మెయింటెయిన్ చేయండి, ఎవరికీ ఫొటోలు ఇవ్వకండి...' అని చెప్పారట జక్కన్న.