- Telugu News Photo Gallery Cinema photos Keerthy Suresh Father Reacts on Rumours about his daughter marriage telugu cinema news
Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి వార్తలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన నటి తండ్రి.. ఏమన్నారంటే..
మహానటి సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కొద్దిరోజులుగా కీర్తి పెళ్లి గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఆ వార్తలు మరింతగా వ్యాపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కీర్తి తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించిన సంగతి తెలిసిందే. గతంలో నటి తల్లి మాట్లాడుతూ.. తమ కూతురి గురించి వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు.
Updated on: Sep 17, 2023 | 9:38 PM

మహానటి సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కొద్దిరోజులుగా కీర్తి పెళ్లి గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఆ వార్తలు మరింతగా వ్యాపిస్తున్నాయి.

అయితే ఇప్పటివరకు కీర్తి తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించిన సంగతి తెలిసిందే. గతంలో నటి తల్లి మాట్లాడుతూ.. తమ కూతురి గురించి వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. ఇండస్ట్రీలో తనకు స్నేహితులు మాత్రమే ఉన్నారని.. ప్రచారమవుతున్న వార్తలలో నిజం లేదన్నారు.

ఇక తాజాగా తమ కూతురి పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై కీర్తి తండ్రి సురేష్ కుమార్ స్పందించారు. కీర్తికి పెళ్లి కుదిరితే మీడియాకు ముందుగా మేమే చెబుతామని.. ఇలాంటి సున్నితమైన విషయాలపై రూమర్స్ క్రియేట్ చేయొద్దని అన్నారు.

కీర్తి పెళ్లి గురించి వస్తోన్న వార్తలతో కుటుంబంలో మనశ్శాంతి కరువవుతుందంటూ అసహనం వ్యక్తం చేశారు. గతంలో తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై కీర్తి స్పందిస్తూ.. పెళ్లి వార్తలు చూసి షాకయ్యానని.. సోషల్ మీడియాలో తనకు మూడు, నాలుగు సార్లు పెళ్లి చేశారని అసహనం వ్యక్తం చేసింది.

సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటానని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తనకు మంచి స్నేహితుడని అన్నారు. ఇటీవల భోళా శంకర్ సినిమాలో నటించింది కీర్తి.

కీర్తి సురేష్ పెళ్లి వార్తలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన నటి తండ్రి.. ఏమన్నారంటే..




