కావ్య కళ్యాణ్ రామ్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గంగోత్రి మూవీతో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచమైన కావ్య కళ్యాణ్ రామ్ ప్రస్తుతం హీరోయిన్ రాణిస్తోంది.బాలు, ఠాగూర్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ వంటి మెగా హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉన్నత చదువుల కోసం కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఒక్కసారిగా వెండితెరకు దూరమైంది ఈ ముద్దుగుమ్మ.