- Telugu News Photo gallery Cinema photos Kannada Actress Ramya Register Complaint against netizen who Abused her in Instagram
Actress Ramya: అసభ్యకర కామెంట్స్ చేసిన నెటిజన్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్
ప్రముఖ కన్నడ నటి రమ్య తెలుగువారికి కూడా పరిచయమే. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన అభిమన్యు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిందీ ముద్దుగుమ్మ.
Updated on: Jun 11, 2022 | 12:52 PM

ప్రముఖ కన్నడ నటి రమ్య తెలుగువారికి కూడా పరిచయమే. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన అభిమన్యు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిందీ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత పలు కన్నడ, తమిళ్ డబ్బింగ్ చిత్రాలతో మరింత చేరువైంది. ముఖ్యంగా సూర్య హీరోగా నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలో రమ్య అభినయం అందరినీ ఆకట్టుకుంది.

కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఆమె రాజకీయాల్లో కూడా తన అదృష్టం పరీక్షించుకున్నాడు. కాంగ్రెస్ ఎంపీగా సేవలందించారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజీనామా చేసింది.

సినిమాలు, రాజకీయాలకు దూరంగా ఉంటోన్న రమ్య సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటోంది. తన పర్సనల్ విషయాలతో పాటు ఫొటోలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది.

ఈ క్రమంలోనే రమ్యకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తనని తరచూ ట్రోల్ చేస్తున్నాడని, అసభ్యకర కామెంట్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆమె బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది.

రక్షిత్ శెట్టి నటించిన చార్లీ 777 మూవీ నేడు(జూన్ 10) విడుదలైంది. నిన్న ఈ సినిమా ప్రివ్యూ చూసిన రమ్య.. సినిమా బాగుందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. దీనికి ప్రీతమ్ ప్రిన్స్ అనే నెటిజన్ అశ్లీలమైన కామెంట్ చేశాడు. ఈక్రమంలోనే ప్రీతమ్ గతంలోనూ తనకు అసభ్యకర సందేశాలు పంపాడని, తరచూ ట్రోల్ చేస్తున్నాడంటూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది రమ్య.





























