- Telugu News Photo Gallery Cinema photos Kamal Haasan starrer Indian 3 on the way say makers of Indian 2, will it effect Ram Charan Game changer movie
Indian 3: ఇండియన్ 3 ఆన్ ది వే అంటున్న మేకర్స్.. మరి గేమ్ ఛేంజర్ పరిస్థితేంటి ??
శంకర్ ఏం మాయ చేయాలనుకుంటున్నారు..? అసలు ఆయన ప్లాన్ ఏంటి..? మూడేళ్లకు ఒక్క సినిమా చేయడానికి కూడా ఇబ్బంది పడే ఈ దర్శకుడు.. ఒకేసారి మూడు సినిమాలను ఎలా హ్యాండిల్ చేస్తున్నారు..? ఇండియన్ 2తో సిరీస్ అయిపోతుందనుకుంటే.. పార్ట్ 3 కూడా కన్ఫర్మ్ చేసారు. మరి ఇండియన్ 3 ఎప్పుడు ఉండబోతుంది..? దాని ముచ్చట్లేంటి..? మధ్యలో గేమ్ ఛేంజర్ పరిస్థితేంటి..? శంకర్ పూర్తిగా మారిపోయారు.. ఒకప్పుడు ఈయన మూడేళ్లకో సినిమా చేయడానికి కూడా కష్టపడేవాళ్లు.. అదేంటంటే క్వాలిటీ పేరు చెప్పేవారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Nov 09, 2023 | 8:28 PM

శంకర్ ఏం మాయ చేయాలనుకుంటున్నారు..? అసలు ఆయన ప్లాన్ ఏంటి..? మూడేళ్లకు ఒక్క సినిమా చేయడానికి కూడా ఇబ్బంది పడే ఈ దర్శకుడు.. ఒకేసారి మూడు సినిమాలను ఎలా హ్యాండిల్ చేస్తున్నారు..? ఇండియన్ 2తో సిరీస్ అయిపోతుందనుకుంటే.. పార్ట్ 3 కూడా కన్ఫర్మ్ చేసారు. మరి ఇండియన్ 3 ఎప్పుడు ఉండబోతుంది..? దాని ముచ్చట్లేంటి..? మధ్యలో గేమ్ ఛేంజర్ పరిస్థితేంటి..?

శంకర్ పూర్తిగా మారిపోయారు.. ఒకప్పుడు ఈయన మూడేళ్లకో సినిమా చేయడానికి కూడా కష్టపడేవాళ్లు.. అదేంటంటే క్వాలిటీ పేరు చెప్పేవారు. కానీ ఇప్పుడలా కాదు.. కుదిర్తే ఏడాదికి మూడు సినిమాలు చేస్తానంటున్నారు. క్వాలిటీ ఉంటుంది కంగారు అవసరం లేదంటున్నారు శంకర్. ఓ వైపు ఇండియన్ 2.. మరోవైపు గేమ్ ఛేంజర్ నడుస్తుండగానే.. సీన్‌లోకి ఇండియన్ 3 కూడా వచ్చేసింది.

Indian 02 Latest Photos

ఇండియన్ 2 షూటింగ్ ప్రస్తుతం విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు శంకర్. అయితే ఈ చిత్ర రషెస్ చూసాక పార్ట్ 3 కూడా ప్లాన్ చేస్తున్నారు. కమల్ పుట్టిన రోజు సందర్భంగా ఇండియన్ 3 ముచ్చట్లు చెప్పారు మేకర్స్. 2024 సమ్మర్‌లో ఇండియన్ 2.. డిసెంబర్ లేదంటే 2025 సంక్రాంతికి ఇండియన్ 3 రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు దర్శక నిర్మాతలు.

అంతా బాగానే ఉంది కానీ మధ్యలో మా రామ్ చరణ్ సినిమా పరిస్థితేంటి అంటూ కంగారు పడుతున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే చాలా ఆలస్యమైంది గేమ్ ఛేంజర్. ఇప్పుడు ఇండియన్ 3 కూడా వస్తే.. చరణ్‌కు తిప్పలు తప్పవు.

కానీ ఇండియన్ 3 కంటే ముందు గేమ్ ఛేంజర్ పూర్తి చేస్తానంటున్నారు శంకర్. అదే జరిగితే 2024లోనే ఇండియన్ 2, గేమ్ ఛేంజర్.. 2025లో ఇండియన్ 3 వచ్చే ఛాన్స్ ఉంది. చూడాలిక.. చివరి వరకు ఈ ప్లానింగ్‌లో ఎన్ని మార్పులొస్తాయో..?





























