- Telugu News Photo Gallery Cinema photos Other Heroes showing interest in movies with Trivikram Srinivas, but he is doing movies only with Pawan Kalyan, Jr. NTR and Mahesh babu
Trivikram: మాటల మాంత్రికుడే హీరోలందరి ‘ఫేవరెట్’.. మరి ఎందుకని కొందరికే ఛాన్స్..
వి వాంట్ త్రివిక్రమ్.. టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న స్లోగన్ ఇది. అంతగా వాళ్లంతా అడుగుతున్నా.. మాటల మాంత్రికుడు మాత్రం ఎందుకు ఒకరిద్దరు హీరోలతోనే స్టిక్ అయిపోయారు..? మిగిలిన హీరోలతో సినిమాలు చేయలేకపోతున్నారా లేదంటే కంఫర్ట్ జోన్ కాదని ఫీల్ అవుతున్నారా..? అసలు త్రివిక్రమ్ కోసం ఎదురు చూస్తున్న హీరోలెవరు.. ఆయనెందుకు వాళ్లకు నో చెప్తున్నారు..? అందరికీ త్రివిక్రమే కావాలి.. ఒక్క సినిమా అంటూ చాలా మంది హీరోలు పోటీ పడుతున్నారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Nov 09, 2023 | 8:45 PM

వి వాంట్ త్రివిక్రమ్.. టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న స్లోగన్ ఇది. అంతగా వాళ్లంతా అడుగుతున్నా.. మాటల మాంత్రికుడు మాత్రం ఎందుకు ఒకరిద్దరు హీరోలతోనే స్టిక్ అయిపోయారు..? మిగిలిన హీరోలతో సినిమాలు చేయలేకపోతున్నారా లేదంటే కంఫర్ట్ జోన్ కాదని ఫీల్ అవుతున్నారా..? అసలు త్రివిక్రమ్ కోసం ఎదురు చూస్తున్న హీరోలెవరు.. ఆయనెందుకు వాళ్లకు నో చెప్తున్నారు..?

అందరికీ త్రివిక్రమే కావాలి.. ఒక్క సినిమా అంటూ చాలా మంది హీరోలు పోటీ పడుతున్నారు. మెగాస్టార్ నుంచి మొదలుపెడితే ఎనర్జిటిక్ స్టార్ వరకు అంతా గురూజీ కోసమే చూస్తున్నారు కానీ ఆయన మాత్రం అందరికీ సారీ చెప్పి.. ఆల్రెడీ చేసిన హీరోలతోనే రిపీట్ చేస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు కారంతో బిజీగా ఉన్న త్రివిక్రమ్.. నెక్ట్స్ అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లను లైన్‌లో పెట్టారు.

అదేంటో కానీ కొందరు హీరోలతోనే కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకున్నారు త్రివిక్రమ్. 20 ఏళ్ళ కెరీర్‌లో తరుణ్, నితిన్ మినహాయిస్తే.. త్రివిక్రమ్ పని చేసిన హీరోలు ముగ్గురే. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్‌తోనే అన్ని సినిమాలు చేసారు గురూజీ. ఎన్టీఆర్‌తో అరవింద సమేత తెరకెక్కించిన త్రివిక్రమ్.. నెక్ట్స్ మళ్లీ ఆయనతోనే మరో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసారు కూడా.

త్రివిక్రమ్‌తో పని చేయడానికి చిరంజీవి, వెంకటేష్ ఎప్పట్నుంచో వేచి చూస్తున్నారు కానీ వర్కవుట్ అవ్వట్లేదు. రామ్‌తో సినిమా ఇలాగే అవుతుంది.

స్రవంతి రవికిషోర్, త్రివిక్రమ్ మధ్య సాన్నిహిత్యం కారణంగా ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుందనిపించినా.. వాయిదాలు పడుతూనే ఉంది. మొత్తానికి ఆ ముగ్గురు నలుగురు హీరోలకే పరిమితం అవుతున్నారు త్రివిక్రమ్. వాళ్లను దాటి.. మిగిలిన హీరోల వైపు ఎప్పుడొస్తారో చూడాలిక.





























