- Telugu News Photo Gallery Cinema photos Nandamuri Balakrishna and Jr. NTR movies release date to clash in 2024
2024 బాలయ్య, ఎన్టీఆర్ సినిమాల.. నందమూరి హీరోల పోటీ ఎలా ఉండబోతుంది ??
బాక్సాఫీస్ దగ్గర బాబాయ్ అబ్బాయి పోటీ పడబోతున్నారా.?? ఎప్పుడో ఫిక్సైన జూనియర్ ఎన్టీఆర్ డేట్‌ను బాలయ్య వచ్చి కబ్జా చేస్తున్నారా..? లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్ట్‌గా అబ్బాయితో పోరుకు సై అంటున్నారా.?? 2024 సమ్మర్‌పై బాలయ్య కూడా కన్నేసారు. అప్పుడే ఎన్టీఆర్ కూడా రాబోతున్నారు. మరి నందమూరి హీరోల పోటీ ఎలా ఉండబోతుంది..? భగవంత్ కేసరితో వరసగా మూడో విజయం అందుకున్న బాలయ్య.. మామూలు జోరు చూపించట్లేదు. పొలిటికల్ బిజీలో ఉండి కూడా నెక్ట్స్ సినిమాను మొదలు పెట్టారీయన.
Updated on: Nov 09, 2023 | 9:10 PM

బాక్సాఫీస్ దగ్గర బాబాయ్ అబ్బాయి పోటీ పడబోతున్నారా.?? ఎప్పుడో ఫిక్సైన జూనియర్ ఎన్టీఆర్ డేట్‌ను బాలయ్య వచ్చి కబ్జా చేస్తున్నారా..? లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్ట్‌గా అబ్బాయితో పోరుకు సై అంటున్నారా.?? 2024 సమ్మర్‌పై బాలయ్య కూడా కన్నేసారు. అప్పుడే ఎన్టీఆర్ కూడా రాబోతున్నారు. మరి నందమూరి హీరోల పోటీ ఎలా ఉండబోతుంది..?

భగవంత్ కేసరితో వరసగా మూడో విజయం అందుకున్న బాలయ్య.. మామూలు జోరు చూపించట్లేదు. పొలిటికల్ బిజీలో ఉండి కూడా నెక్ట్స్ సినిమాను మొదలు పెట్టారీయన. బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న షూటింగ్ మొదలైంది. ఫైట్ సీక్వెన్స్‌తోనే ఈ చిత్ర షూటింగ్ షురూ చేసారు దర్శక నిర్మాతలు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

బాలయ్య సినిమాను ఆర్నెళ్లలోనే పూర్తి చేయాలని చూస్తున్నారు బాబీ. గతంలో వాల్తేరు వీరయ్యను కూడా చాలా తక్కువ రోజుల్లోనే పూర్తి చేసారీయన.

అన్నీ కుదిర్తే 2024, మార్చ్ 29న విడుదల చేయాలనేది మేకర్స్ ప్లాన్. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇదే డేట్ కన్ఫర్మ్ అయితే.. ఎన్టీఆర్‌తో పోటీ తప్పకపోవచ్చు. ఎందుకంటే ఎప్రిల్ 5న దేవర మొదటి భాగం విడుదల కానుంది.

దేవర ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తైంది. ఈ మధ్యే గోవా షెడ్యూల్ మొదలైంది. డిసెంబర్ నాటికి ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు కొరటాల శివ. ఆ తర్వాత ఆయన వార్ 2తో బిజీ కానున్నారు. ఎప్రిల్ 5న దేవర రావడం కన్ఫర్మ్. బాలయ్య కూడా మార్చ్ 29న వస్తే పోరు మరింత మజాగా మారిపోనుంది. చూడాలిక.. బాబాయ్, అబ్బాయి వార్ ఎలా ఉండబోతుందో..?




