- Telugu News Photo Gallery Cinema photos Hero Kamal Haasan Busy with his upcoming Movies and details here on 10 11 2023 Telugu Heros Photos
Kamal Haasan: వరుస సినిమాలతో బిజీగా కమల్ హాసన్.! ఈసారి మరింత యాక్షన్..
ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్ కమల్ హాసన్ కష్టాలను తీర్చేసింది.. జాతకం అంతా మార్చేసింది. ఇప్పుడు మనం చూస్తున్నది కమల్ కాదు.. ఆయన 2.0 వర్షన్. ఇక్కడ మనం ఎలాగైతే బాలయ్యను చూస్తున్నామో.. విక్రమ్ విజయం తర్వాత కమల్ కూడా అలాగే పూర్తిగా మారిపోయారు. అసలు ఒక్క సినిమాతోనే ఇంత మార్పు ఎలా వచ్చింది..? కమల్ ప్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి..? నిజంగానే వన్స్ అప్ ఆన్ ఏ టైమ్ అన్నట్లుండేది కమల్ హాసన్ పరిస్థితి విక్రమ్ సినిమాకు ముందు.
Updated on: Nov 10, 2023 | 2:38 PM

ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్ కమల్ హాసన్ కష్టాలను తీర్చేసింది.. జాతకం అంతా మార్చేసింది. ఇప్పుడు మనం చూస్తున్నది కమల్ కాదు.. ఆయన 2.0 వర్షన్. ఇక్కడ మనం ఎలాగైతే బాలయ్యను చూస్తున్నామో.. విక్రమ్ విజయం తర్వాత కమల్ కూడా అలాగే పూర్తిగా మారిపోయారు.

అసలు ఒక్క సినిమాతోనే ఇంత మార్పు ఎలా వచ్చింది..? కమల్ ప్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి..? నిజంగానే వన్స్ అప్ ఆన్ ఏ టైమ్ అన్నట్లుండేది కమల్ హాసన్ పరిస్థితి విక్రమ్ సినిమాకు ముందు.

భారతీయుడు తర్వాత ఆ రేంజ్ సక్సెస్ పాతికేళ్లుగా కమల్‌కు రాలేదంటే నమ్మడం కష్టమే. కానీ ఏం చేస్తాం.. అదే నిజం మరి. మధ్యలో ఒకట్రెండు సినిమాలు వచ్చినా కంటితుడుపే కానీ.. బ్లాక్‌బస్టర్స్ మాత్రం కావు.

కానీ విక్రమ్‌తో తన స్థాయి చూపించారు కమల్. తాజాగా ఇండియన్ 2తో వస్తున్నారు. కమల్ హాసన్ కెరీర్ ప్రస్తుతం టాప్ స్పీడ్‌లో ఉంది. ఒకటి రెండు కాదు.. ఒకేసారి మూడు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారీయన.

ఒక్కో సినిమా బడ్జెట్ 200 కోట్లకు పైగానే ఉంది. అంటే ఒక్క హీరోపై 600 కోట్ల బిజినెస్ నడుస్తుందిప్పుడు. విక్రమ్ తర్వాత తన 2.0 వర్షన్ చూపిస్తున్నారు కమల్. ఇండియన్ 2లోనే కాదు.. వినోద్, మణిరత్నం సినిమాల్లోనూ కొత్తగా కనిపిస్తున్నారు కమల్.

66 ఏళ్ల వయసులో యాక్షన్ సినిమాలు చేస్తున్నారు కమల్. విక్రమ్‌లోనే అదరగొట్టిన ఈయన.. ఇండియన్ 2లో మరోసారి తన విన్యాసాలు చూపించబోతున్నారు.

అలాగే వినోద్ అంటే కేరాఫ్ యాక్షన్ సినిమాలే. ఇక మణిరత్నం థగ్ లైఫ్ ఇంట్రో చూసాక సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి నెక్ట్స్ రెండేళ్లలో ఇండియన్ స్క్రీన్‌పై కమల్ సునామీ ఖాయం.




