- Telugu News Photo Gallery Cinema photos Kamal haasan Shocking Comments on prabhas Kalki movie Shooting update Telugu Heroes Photos
Kalki 2898 AD: కల్కి 2898 ఏడి సినిమాపై మరో అనుమానం.! షూటింగ్ చివరిలో అదేం ట్విస్ట్.
ఎక్కడైనా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే క్లారిటీ వస్తుంది కానీ కల్కి విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చిన తర్వాత కూడా చాలా అనుమానాలు అభిమానుల్ని తెగ వేధిస్తున్నాయి. తాజాగా కమల్ హాసన్ కామెంట్స్‌తో ఆ డౌట్స్ మరింత పెరిగిపోయాయి. ఇంతకీ కల్కి విషయంలో ఆ కన్ఫ్యూజన్స్ ఏంటి..? సలార్ తర్వాత ప్రభాస్‌లో జోరు మరింత పెరిగింది.
Updated on: Mar 26, 2024 | 2:45 PM

ఎక్కడైనా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే క్లారిటీ వస్తుంది కానీ కల్కి విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చిన తర్వాత కూడా చాలా అనుమానాలు అభిమానుల్ని తెగ వేధిస్తున్నాయి.

తాజాగా కమల్ హాసన్ కామెంట్స్‌తో ఆ డౌట్స్ మరింత పెరిగిపోయాయి. ఇంతకీ కల్కి విషయంలో ఆ కన్ఫ్యూజన్స్ ఏంటి..? సలార్ తర్వాత ప్రభాస్‌లో జోరు మరింత పెరిగింది.

చాలా కాలంగా వేచి చూస్తున్న విజయం రావడంతో అస్సలు తగ్గట్లేదు రెబల్ స్టార్. సలార్ కూడా భారీగా వసూలు చేసిందే కానీ బ్లాక్‌బస్టర్ అయితే కాదు. దాంతో ఆ లోటును కల్కితో పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రభాస్.

మారుతితో రాజా సాబ్ చేస్తున్నా.. దాన్ని కాదని మరీ కల్కికే డేట్స్ ఇచ్చారు ప్రభాస్. కల్కి 2898 ఏడి షూటింగ్ చివరిదశకు వచ్చింది. టాకీ పార్ట్ పూర్తైనా.. పోస్ట్ ప్రొడక్షన్‌కు ఇంకా టైమ్ పట్టేలా ఉంది.

పైగా ఎన్నికలు కూడా ఉండటంతో వాయిదా దాదాపు ఖాయమైపోయింది. సిజి వర్క్స్ కోసమే చాలా సమయం తీసుకుంటున్నారు నాగ్ అశ్విన్. తాజాగా కల్కి గురించి ఆసక్తికరమైన విషయం చెప్పారు కమల్ హాసన్.

ఇందులో తాను చేసింది గెస్ట్ రోల్ అన్నారు లోకనాయకుడు. కల్కిలో కమల్ విలన్ అన్నారు. ఇక్కడ చూస్తే కమల్ ఏమో తాను అతిథినే అంటున్నారు. అసలు కల్కి సినిమాలో విలన్స్ ఎవరనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.

ఒకవేళ కమలే విలన్ అయితే.. కనిపించే ఆ కాసేపులో నాగ్ అశ్విన్ ఆ పాత్రను ఎలా డిజైన్ చేసారనేది మరింత ఇంట్రెస్టింగ్. ఏదేమైనా కల్కి మాత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిందిప్పుడు.




