- Telugu News Photo Gallery Cinema photos Jr ntr prashanth neels NTR31 movie shooting update on 05 06 2025
Jr NTR: బిజీ బిజీగా గడుపుతున్న మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్
రకరకాల టాపిక్స్ తో ట్రెండ్ అవుతున్నారు తారక్. ఒకటికి రెండు ప్రాజెక్టులతో హల్‌చల్ చేస్తున్నారు. సౌత్ వాళ్ల ఫోకస్ ఓ రకంగా ఉంటే, నార్త్ జనాలు ఇంకో రకంగా ఆలోచిస్తున్నారు. ఎవరు దేని గురించి పట్టించుకున్నా... ప్యాన్ ఇండియా రేంజ్‌లో పేరు మారుమోగుతోంది. వార్2 సినిమా మీద ఆల్రెడీ ఉన్న హైప్‌ని వందింతలు పెంచేసింది టీజర్.
Updated on: Jun 05, 2025 | 6:40 PM

వార్2 సినిమా మీద ఆల్రెడీ ఉన్న హైప్‌ని వందింతలు పెంచేసింది టీజర్. కబీర్ కేరక్టర్ గురించి తారక్ వాయిస్‌లో వినడం వావ్ ఫ్యాక్టరంటున్నారు గ్రీక్ గాడ్ ఫ్యాన్స్. తారక్ విజువల్స్ కూడా స్టన్నింగ్‌గా ఉన్నాయని, స్క్రీన్ మీద వీరిద్దరు చెలరేగుతుంటే చూడ్డానికి రెడీగా ఉన్నామని చెబుతున్నారు.

వార్ 2 సినిమా మీద అంచనాలు పెంచుతున్న అంశాల్లో ఎన్టీఆర్, హృతిక్ సాంగ్ కూడా ఒకటి. ఈ పాటను ఈ నెల చివర్లో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు హీరోలు వారం రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు.

ఇప్పటికే సాంగ్ షూటింగ్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టారు హృతిక్, తారక్. నాటు నాటులో తారక్, చరణ్ స్టెప్పులు చూసిన వారందరూ ఇప్పుడు వార్2 సాంగ్ మీద వీరలెవల్లో హోప్స్ పెట్టుకున్నారు.

హృతిక్, తారక్ ఇద్దరూ ట్రెమండస్ డ్యాన్సర్లు కావడంతో ఈ సాంగ్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని ఓ ఊపు ఊపేస్తుందని ఫిక్సయ్యారు.ఇటు నీల్ సినిమా కూడా స్పీడందుకుంది. ఈ మూవీ కోసం స్పెషల్ సెట్‌ని డిజైన్ చేశారు మేకర్స్.

ఈ నెల మూడో వారం నుంచి అక్కడే షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. తారక్‌తో పాటు కీలక నటీనటులందరూ ఈ షెడ్యూల్‌లో పార్టిసిపేట్ చేస్తారట. సినిమాకి ఈ సీక్వెన్స్ హైలైట్ అవుతుందని టాక్.




