Disha Patani: హాలీవుడ్ పిలుస్తోందంటున్న దిశా పటానీ..
బాలీవుడ్ బ్యూటీ దిశా పాట్ని ఈ మధ్య ఏం అనుకుంటే అది జరుగుతోంది. సౌత్, నార్త్ కంప్లీట్ అయిందంటూ ఇప్పుడు సరిహద్దులు చెరిపేసి హాలీవుడ్‌ని ఎయిమ్ చేస్తున్నారు. మరి మన సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తారా? అక్కడే సెటిల్ అవుతారా? బాలీవుడ్ బ్యూటీ దిశా పాట్ని ఈ మధ్య ఏం అనుకుంటే అది జరుగుతోంది. సౌత్, నార్త్ కంప్లీట్ అయిందంటూ ఇప్పుడు సరిహద్దులు చెరిపేసి హాలీవుడ్‌ని ఎయిమ్ చేస్తున్నారు. మరి మన సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తారా? అక్కడే సెటిల్ అవుతారా?
Updated on: Jun 05, 2025 | 6:50 PM

కల్కి సినిమాలో హీరో భైరవ. అతని లవ్ ఇంట్రస్ట్ రాక్సీ. ఈ రోల్ చేసింది దిశా పాట్ని. కథ పరంగా పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. కొన్ని సీన్లు, ఓ సాంగ్‌కి మాత్రమే పరిమితమయ్యారు దిశా. అయినా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దిశతో డార్లింగ్ ఆడిపాడిన సాంగ్‌కి మంచి క్రేజ్ వచ్చింది.

నెక్స్ట్ పార్ట్ 2లో వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకొంచెం ఎక్కువే ఉండొచ్చనే మాటలూ వినిపిస్తున్నాయి.కల్కి తర్వాత కంగువ మీద కూడా బిగ్ హోప్స్ పెట్టుకున్నారు దిశ. కానీ సూర్యతో నటించిన కంగువ ఈ అమ్మణికి కలిసి రాలేదు.

సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కంగువ అనుకున్నంత సక్సెస్ అయి ఉంటే తప్పకుండా సీక్వెల్ ఉండేది. సౌత్‌లో దిశకు మరో ప్రాజెక్ట్ ఉండేది. కల్కి సీక్వెల్ స్టార్ట్ అయ్యేవరకు బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీ కావాలన్నది దిశ ప్లాన్.

ప్రస్తుతం బాలీవుడ్‌లో వెల్కమ్ టు ద జంగిల్ చేస్తున్నారు దిశ. ఈ సినిమా తర్వాత మాత్రం మరే ప్రాజెక్టులకూ సైన్ చేయలేదు. సమ్‌థింగ్ బిగ్ అంటూ ఊరించారు.ఆ బిగ్ న్యూస్ ఇప్పుడు రివీల్ అయింది.

బాలీవుడ్ బ్యూటీ దిశా పాట్నీ హాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ది యూజువల్ సస్పెక్ట్, హౌస్ ఆఫ్ కార్డ్స్ లాంటి సినిమాలతో ప్రూవ్ చేసుకున్న ఆస్కార్ విన్నర్ కెవిన్ స్పేసీ నెక్ట్స్ మూవీ లో కీలక పాత్రలో నటించబోతున్నారు దిశా. హోలీ గార్డ్స్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం 20 ఏళ్ల తరువాత మెగా ఫోన్ పడుతున్నారు కెవిన్.




