- Telugu News Photo Gallery Cinema photos Radhika Apte says working in Bollywood is difficult for new mothers
Radhika Apte: ఇండస్ట్రీలో పోస్ట్ డెలివరీ పై రాధికా ఆప్టే కామెంట్స్..
పోస్ట్ డెలివరీ సినిమా ఇండస్ట్రీలో పనిచేయడానికి మహిళలకు అనుకూల వాతావరణం ఉందా? ఇప్పుడు ఇండస్ట్రీలో ఓపెన్‌గా డిబేట్ అవుతున్న టాపిక్ ఇది. పే పార్షియాలిటీ నుంచి ప్రతి విషయంలోనూ తన ఒపీనియన్‌ని షేర్ చేసుకున్న రాధికా ఆప్టే ఈ విషయం గురించి కూడా మాట్లాడారు. ఇంతకీ ఆమె చెప్పిందేంటి? పోస్ట్ డెలివరీ సినిమా ఇండస్ట్రీలో పనిచేయడానికి మహిళలకు అనుకూల వాతావరణం ఉందా? ఇప్పుడు ఇండస్ట్రీలో ఓపెన్‌గా డిబేట్ అవుతున్న టాపిక్ ఇది. పే పార్షియాలిటీ నుంచి ప్రతి విషయంలోనూ తన ఒపీనియన్‌ని షేర్ చేసుకున్న రాధికా ఆప్టే ఈ విషయం గురించి కూడా మాట్లాడారు. ఇంతకీ ఆమె చెప్పిందేంటి?
Updated on: Jun 05, 2025 | 8:30 PM

పోస్ట్ డెలివరీ సినిమా ఇండస్ట్రీలో పనిచేయడానికి మహిళలకు అనుకూల వాతావరణం ఉందా? ఇప్పుడు ఇండస్ట్రీలో ఓపెన్‌గా డిబేట్ అవుతున్న టాపిక్ ఇది. పే పార్షియాలిటీ నుంచి ప్రతి విషయంలోనూ తన ఒపీనియన్‌ని షేర్ చేసుకున్న రాధికా ఆప్టే ఈ విషయం గురించి కూడా మాట్లాడారు. ఇంతకీ ఆమె చెప్పిందేంటి?

రాధికా ఆప్టే మన దగ్గర చేసింది తక్కువ సినిమాలే అయినా జనాలకు గుర్తుండిపోయారు. ఇప్పుడు నార్త్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్న ఈ లేడీ సినిమా ఇండస్ట్రీలో ప్రెజెంట్ హల్ చల్ చేస్తున్న ఇష్యూ గురించి మాట్లాడారు.

పోస్ట్ డెలివరీ ఇండస్ట్రీలో మహిళలకు అంత అనుకూలమైన వాతావరణం ఉంటుందని నేననుకోవడం లేదు. ఇక్కడ వర్కింగ్ హవర్స్ ఎక్కువగా ఉంటాయి. అంతంత సేపు పిల్లలకు దూరంగా ఉండటం కష్టమేనని అన్నారు రాధికా.

అయితే ఈ ఇష్యూతో సంబంధం లేకపోయినా విద్యాబాలన్ షేర్ చేసుకున్న ఒపీనియన్ కూడా వైరల్ అవుతోంది.పరిస్థితులకు తగ్గట్టు అమ్మాయిలు మారాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటేనే ఇండస్ట్రీలో లైమ్‌లైట్‌లో ఉంటాం.

లేకుంటే ఫేడవుడ్ అవుతామని చెప్పారు విద్యా. రీసెంట్‌గా దీపిక రెయిజ్ చేసిన వర్కింగ్ హవర్స్ ఇష్యూ గురించే ఇంత హాట్ డిస్కషన్ జరుగుతోందంటున్నారు క్రిటిక్స్.




