- Telugu News Photo Gallery Cinema photos Jr NTR Buys India's First Lamborghini Urus Graphite Capsule Edition
JR NTR: ఎన్టీఆర్ గ్యారెజ్‌లోకి లాంబొర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ మోడల్.. దేశంలోనే మొదటిది.. కాస్ట్..?
ఎన్టీఆర్ మరో లగ్జరీ కారును కొనుగోలు చేశారు. దేశంలో లాంబొర్గిని కొత్త మోడల్‌ను కొనుగోలు చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు.
Updated on: Aug 18, 2021 | 7:11 PM

యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కు కార్లంటే ఎంతో ఇష్టమో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఆయన గ్యారేజ్‌లో రకరకాల కార్లు దర్శనమిస్తాయి. ఇప్పుడు తాజాగా ఈ గ్యారేజ్‌లోకి మరో కారు అడుగుపెట్టనుంది.

విలాసవంతమైన స్పోర్ట్స్ కార్లకు కేరాఫ్ అయిన లాంబొర్గిని (lamborghini urus graphite capsule) కారును తారక్ ఇటీవల కొనుగోలు చేశారు. ఫారెన్ నుంచి దిగుమతి అయిన ఈ కారు ప్రస్తుతం బెంగళూరులో ఉంది. త్వరలోనే హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి చేరుకుంటుంది.

భారత్‌లో లాంబొర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ మోడల్‌ను కొనుగోలు చేసిన తొలి వ్యక్తి ఎన్టీఆర్ కావడం విశేషం. ఈ విలాసవంతమైన కారు ధర రూ. 3 కోట్ల పైనే ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తారక్ 'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఉక్రెయిన్‌లో జరుగుతోంది.

ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో చిన్న రామారావు గారి రేంజ్ మరో లెవల్‌కు వెళ్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.





























