- Telugu News Photo Gallery Cinema photos Jr. NTR And Vishwaksen Attend Tillu Square Movie Success Meet, See Photos
Tillu Square: టిల్లు గాడి సక్సెస్ మీట్ లో సెలబ్రిటీల సందడి.. ఎవరెవరు ఏమేం మాట్లాడారంటే? ఫొటోస్
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా, మలయాళ కుట్టీ అనుమప జంటగా నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. సుమారు రెండేళ్ల క్రితం రిలీజైన డీజే టిల్లుకు సీక్వెల్ గా ఇది తెరకెక్కింది. నేహా శెట్టి కూడా ఒక క్యామియో రోల్ లో తళుక్కుమంది.
Updated on: Apr 08, 2024 | 10:25 PM

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా, మలయాళ కుట్టీ అనుమప జంటగా నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. సుమారు రెండేళ్ల క్రితం రిలీజైన డీజే టిల్లుకు సీక్వెల్ గా ఇది తెరకెక్కింది. నేహా శెట్టి కూడా ఒక క్యామియో రోల్ లో తళుక్కుమంది.

Tillu Square Success Meet

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన హీరో సిద్ధూ జొన్నలగడ్డపై ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నామన్నాడు.

కాగా హీరోయిన్ అనుపమ స్టేజ్‌పైకి ఎక్కగానే ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. అనుపమను మాట్లాడకుండా అరుపులతో అడ్డుకున్నారు. స్టేజ్ దిగిన అనుపమ.. త్రివిక్రమ్ నుంచి ఆశీర్వాదం తీసుకుంది.

ఇక చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపిన నేహా.. అభిమానుల రెస్పాన్స్‌కు ఎమోషనల్ అయ్యింది. అభిమానుల అరుస్తుంటే తనకు ఏడుపోస్తుందంటూ భావోద్వేగానికి లోనైంది

ఇదే ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. చెప్పికొట్టడంలో కిక్ వేరే ఉంటుంది.. సిద్దు చెప్పి మరీ కొట్టిండు అని అగ్రెసివ్ గా మాట్లాడాడు.