- Telugu News Photo Gallery Cinema photos Janhvi Kapoor Taking Huge Amount As Remuneration For Her Tollywood Debut Movie Devara With Jr NTR
Janhvi Kapoor: ఎన్టీఆర్ దేవర కోసం జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? వామ్మో అన్ని కోట్లు తీసుకుంటుందా?
దివంగత నటి అందాల తార శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. తన అందం, అభినయంతో కొన్నిరోజుల్లోనే క్రేజీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న యంగ్ హీరోయిన్లలో జాన్వీ కపూర్ కూడా ఒకరు.
Updated on: Sep 24, 2023 | 10:45 AM

దివంగత నటి అందాల తార శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. తన అందం, అభినయంతో కొన్నిరోజుల్లోనే క్రేజీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న యంగ్ హీరోయిన్లలో జాన్వీ కపూర్ కూడా ఒకరు.

కాగా శ్రీదేవి-బోనీ కపూర్ కుమార్తె జాన్హవి కపూర్ తన నటనతో పాటు గ్లామరస్ లుక్స్‌తోనూ పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పటికే పలు బాలీవుడ్ హిట్ సినిమాల్లో నటించిన జాన్వీ కపూర్ ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఎంపికైంది. హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు.

కాగా సినిమా కోసం జాన్వీ కపూర్ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటోందని సమాచారం. తన మొదటి తెలుగు సినిమాకే ఏకంగా 5 కోట్ల రూపాయల పారితోషకం అందుకుంటోందని తెలుస్తోంది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన జాన్వీ లుక్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఇందులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో జూనియర్ శ్రీదేవి కనిపించనున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్స్ హైలెట్‌గా నిలవనున్నాయట.