- Telugu News Photo Gallery Cinema photos Is Hanuman will be release in countries like Japan, China and Spain besides India?
Prasanth Varma: మాట తప్పిన హనుమాన్ డైరెక్టర్..? ఇప్పటి వరకు దాని ఊసే లేదు.!
హనుమాన్ విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇచ్చిన మాట తప్పారా..? లేదంటే హిట్ అయింది కదా అని ఇచ్చిన మాట పక్కనబెట్టేసారా..? కనీసం ఆ మాట ప్రశాంత్ వర్మకు గుర్తుందా..? ఇందాకట్నుంచి ఒకటే మాట మాట అంటున్నారు.. ఎంతకీ ఏంటా మాట అనుకుంటున్నారా..? మరి చూసేయండి ఆలస్యమెందుకు..? 92 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన సంక్రాంతి సినిమాగా హనుమాన్ చరిత్ర తిరగరాసింది. 30 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగి.. 300 కోట్లు వసూలు చేసింది.
Updated on: Mar 04, 2024 | 9:52 AM

హనుమాన్ విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇచ్చిన మాట తప్పారా..? లేదంటే హిట్ అయింది కదా అని ఇచ్చిన మాట పక్కనబెట్టేసారా..? కనీసం ఆ మాట ప్రశాంత్ వర్మకు గుర్తుందా..? ఇందాకట్నుంచి ఒకటే మాట మాట అంటున్నారు.. ఎంతకీ ఏంటా మాట అనుకుంటున్నారా..? మరి చూసేయండి ఆలస్యమెందుకు..?

92 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన సంక్రాంతి సినిమాగా హనుమాన్ చరిత్ర తిరగరాసింది. 30 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగి.. 300 కోట్లు వసూలు చేసింది. బాహుబలి, RRR తర్వాత 100 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చిన సినిమాగా నిలిచింది హనుమాన్. తాజాగా ఈ చిత్ర 50 రోజుల వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు మేకర్స్.

అంతా బాగానే ఉంది కానీ.. హనుమాన్‌ను ఇండియాతో పాటు జపాన్, చైనా, స్పెయిన్ లాంటి దేశాల్లోనూ విడుదల చేస్తామని చెప్పారు ప్రశాంత్ వర్మ. కానీ కొన్నాళ్లుగా ఆ ఊసే లేదు. తాజాగా 50 రోజుల వేడుకలో ఇంటర్నేషనల్ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్. ఇప్పటికే ఫారెన్ డిస్ట్రిబ్యూటర్స్‌తో మాట్లాడామని.. వాళ్లకు బాగా నచ్చిందని తెలిపారు ప్రశాంత్ వర్మ.

హనుమాన్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు పంపిస్తామని తెలిపారు ప్రశాంత్ వర్మ. ఇక జై హనుమాన్ వర్క్ మొదలైందని.. ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారీయన. హీరో ఎవరనేది మాత్రం చెప్పలేదు ఈ దర్శకుడు.

చరణ్, బన్నీ, తారక్, ప్రభాస్ ఇలా అంతా బిజీగా ఉండటంతో.. జై హనుమాన్‌కు హీరో దొరకట్లేదు. అందుకే హనుమంతుడే హీరో అనేసారు ప్రశాంత్ వర్మ. అయితే ఇందులో రానా దగ్గుబాటి హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారని వార్త వైరల్ అవుతుంది. మరి చూడాలిక.. సీక్వెల్ ఎలా ఉండబోతుందో..?




