- Telugu News Photo Gallery Cinema photos Interesting Connection Between Prabhas, Mahesh Babu Movies, Details Here
ప్రభాస్, మహేష్ సినిమాల మధ్య ఈ లింక్ గమనించారా ?? వెరీ ఇంటరెస్టింగ్ గురూ !!
ఏ ఫీల్డ్ లో అయినా ఒక స్టేజ్‌కి రావాలంటే ఒకరి సాయం అందుకోవడం ఎలా అవసరమో, ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత ఇంకొకరికి సాయం చేయడం కూడా అంతే అవసరం. కొన్నిసార్లు సాయం ప్రత్యక్షంగా ఉండొచ్చు. మరికొన్నిసార్లు ఇన్‌డైరక్ట్ గా ఉండొచ్చు... కానీ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్తుంటే, రిజల్ట్ సూపర్‌డూపర్‌గా ఉంటుందన్నది ట్రూ. ప్రభాస్ సినిమాలో యూజ్ చేసిన బుజ్జి కారును రీసెంట్‌గా రైడ్ చేశారు నాగచైతన్య.
Updated on: May 30, 2024 | 1:35 PM

రాజమౌళి సినిమా కమిటయ్యారు కాబట్టి ఇప్పట్లో మహేష్ బాబును సెట్స్‌లో చూడలేం.. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యే పవర్ తీసుకున్నారు కాబట్టి ఆయన కూడా ఇంకొన్నాళ్లు కెమెరా ముందుకు రావడం కష్టమే.!

ఇంకెన్నాళ్లు వెయిట్ చేయాలి అని ఒకింత విసుగును ప్రదర్శిస్తారనుకుంటే, జరుగుతున్న విషయాలను చిరునవ్వుతో చూస్తున్నారు ఘట్టమనేని సైన్యం. బాహుబలి, ట్రిపుల్ ఆర్.. సినిమా ఏదైనా జక్కన్న తీసే పద్ధతి, అయ్యే కాల్షీట్లను ఒక్కసారి గమనించిన వారు ఎవరైనా సరే,

అయితే చైతన్య లాగా... డార్లింగ్ చేస్తున్నది డైరక్ట్ హెల్ప్ కాదు... ఇన్ డైరక్ట్ గా అన్నమాట. జక్కన్న- మహేష్ సినిమాకు... డార్లింగ్ ప్రీవియస్ మూవీస్‌తో లింకు పెట్టి ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు.

శ్రీరామచంద్రమూర్తిగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌లో హనుమంతుడిగా కనిపించారు దేవదత్త నాగే. ఈయన ప్రస్తుతం రాజమౌళి - మహేష్ మూవీకి సైన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కేరక్టర్ డీటైల్స్ రివీల్ కాకపోయినా... రాజమౌళితో తీసుకున్న పిక్ వైరల్ అవుతోంది. మరోవైపు మహేష్ కి విలన్‌గా పృథ్విరాజ్ సుకుమారన్ ఫిక్సయ్యారనే వార్తలూ వినిపిస్తున్నాయి.

ప్రభాస్ - పృథ్విరాజ్ సుకుమారన్ కలిసి సలార్ సినిమా చేశారు. త్వరలోనే సలార్2 సెట్స్ లోనూ కలవడానికి రెడీ అవుతున్నారు. సో... ఇలా ప్రభాస్ సినిమాల్లో నటించిన మెయిన్ ఆర్టిస్టులు, మహేష్ మూవీ అవకాశాలను కొట్టేస్తుండటం ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తోంది. ఇలాంటి వార్తలు వింటుంటే.... మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు యమా స్పీడ్‌గా జరుగుతున్నందుకు హ్యాపీగా ఉందని అంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.




