- Telugu News Photo Gallery Cinema photos Imanvi Trending on Social Media Who Will Be Act In Prabhas and Director Hanu Raghavapudi Project
Actress Imanvi: ప్రభాస్ సరసన ఛాన్స్.. ఒక్కరోజులోనే లక్ష మంది ఫాలోవర్స్.. ఈ హీరోయిన్ బ్యాగ్రౌండ్ తెలుసా..?
ఇమాన్వీ.. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న పేరు. అంతేకాదు.. ఈ అమ్మాడికి ఒక్కరోజులోనే లక్ష మందికి పైగా ఫాలోవర్స్ పెరిగారు. ప్రస్తుతం కుర్రాళ్ల ఆరాద్య దేవతగా మారిపోయింది ఇమాన్వీ. అవును.. ఇంతకీ ఎవరీ బ్యూటీ.. అనుకుంటున్నారా..? ఏకంగా ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసింది.
Updated on: Aug 18, 2024 | 4:20 PM

ఇమాన్వీ.. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న పేరు. అంతేకాదు.. ఈ అమ్మాడికి ఒక్కరోజులోనే లక్ష మందికి పైగా ఫాలోవర్స్ పెరిగారు. ప్రస్తుతం కుర్రాళ్ల ఆరాద్య దేవతగా మారిపోయింది ఇమాన్వీ. అవును.. ఇంతకీ ఎవరీ బ్యూటీ.. అనుకుంటున్నారా..? ఏకంగా ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసింది.

ప్రభాస్ హీరోగా డైరెక్టర్ హను రాఘవపూడీి దర్శకత్వం వహించనున్న హిస్టారికల్ లవ్ స్టోరీ శనివారం అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంఛ్ అయిన సంగతి తెలిసింది ఇందులో మృణాల్ ఠాకూర్, అలియా భట్ హీరోయిన్స్ అనుకున్నారు.. కానీ అనుహ్యంగా ఇమాన్వీ పేరు తెరపైకి వచ్చింది.

కథానాయికగా తొలి సినిమాతో ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ చిన్నది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇమాన్వీ అసలు పేరు ఇమాన్వీ ఇస్మాయిల్. కానీ ఇమాన్వీగానే అందరికీ తెలుసు. 1995లో ఢిల్లీలో పుట్టిన ఇమాన్వీ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యింది.

ఇమాన్వీ మంచి డ్యాన్సర్. వెస్ట్రన్ మాత్రమే కాదు.. భరతనాట్యం, కూచిపూడిలో ఆమెకు ప్రవేశముంది. విదేశాల్లో డ్యాన్సుల్లో శిక్షణ తీసుకుందట. సోషల్ మీడియాలో తెలుగు, హిందీ, తమిళంలోపాటు పలు భాషలకు చెందిన పాటలకు స్టెప్పులు వేస్తూ ఆ రీల్స్ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

అయితే ప్రభాస్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్లో పాల్గొనడానికి ముందు ఇమాన్వీకి ఇన్ స్టాలో ఆరులక్షల ఇరవై వేల మంది వరకు ఫాలోవర్స్ ఉన్నారు. ఓపెనింగ్ ఈవెంట్లో ప్రభాస్ తో దిగిన ఫోటోస్ వైరల్ కావడంతో ఇమాన్వీకి ఒక్కరోజులోనే దాదాపు లక్షకుపైగా ఫాలోవర్స్ పెరిగారు.





























