- Telugu News Photo Gallery Cinema photos Icon Star Allu Arjun Landed in germany for sukumar pushpa 2 movie Telugu Heroes Photos
Allu Arjun – Pushpa 2: పుష్ప 2 కోసం జర్మనీలో అడుగుపెట్టిన అల్లు వారబ్బాయి.
నాన్‌స్టాప్‌గా జరుగుతున్న పుష్ప 2 షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి మరీ జర్మనీ వెళ్లారు అల్లు అర్జున్. ఉన్నట్లుండి ఈయన అక్కడికి వెళ్లడం వెనక అసలు ప్లాన్ ఏంటి..? జర్మనీలో జరుగుతున్న బెర్లిన్ ఫిల్మ్ పెస్టివల్‌కు బన్నీ అటెండ్ అవ్వడం వెనక అంత పెద్ద వ్యూహం ఉందా..? ఈ ఈవెంట్ పుష్ప 2కు ఎంతవరకు యూజ్ కానుంది.? అసలు సుక్కు ప్లాన్ ఏంటి.? పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాం అని చెప్పుకోవడం కాదు.. దానికి తగ్గట్లుగా ప్రమోషన్ కూడా చేసుకున్నపుడే..
Updated on: Feb 16, 2024 | 10:04 PM

నాన్‌స్టాప్‌గా జరుగుతున్న పుష్ప 2 షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి మరీ జర్మనీ వెళ్లారు అల్లు అర్జున్. ఉన్నట్లుండి ఈయన అక్కడికి వెళ్లడం వెనక అసలు ప్లాన్ ఏంటి..?

జర్మనీలో జరుగుతున్న బెర్లిన్ ఫిల్మ్ పెస్టివల్‌కు బన్నీ అటెండ్ అవ్వడం వెనక అంత పెద్ద వ్యూహం ఉందా..? ఈ ఈవెంట్ పుష్ప 2కు ఎంతవరకు యూజ్ కానుంది.? అసలు సుక్కు ప్లాన్ ఏంటి.?

పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాం అని చెప్పుకోవడం కాదు.. దానికి తగ్గట్లుగా ప్రమోషన్ కూడా చేసుకున్నపుడే.. చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్, సుకుమార్ టీం ఇదే చేస్తుంది.

పుష్ప కోసం ప్రపంచాన్ని చుట్టేయాలని ఫిక్సైపోయారు బన్నీ. అందులో భాగంగానే తాజాగా జర్మనీ వెళ్లారు.. అక్కడి ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంటున్నారు. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు కావాల్సిందిగా అల్లు అర్జున్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది.

అక్కడ పుష్ప సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్లారు బన్నీ. అంతేకాదు.. అక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్స్‌తో భేటీ కానున్నారు అల్లు అర్జున్. దాంతో పాటు పుష్ప 2ను అక్కడ ప్రమోట్ చేయాలని చూస్తున్నారు అల్లు వారబ్బాయి.

పుష్ప కథ అంతా ఇండియాలోనే జరుగుతుంది. కానీ పార్ట్ 2 కథను విదేశాలకు లింక్ పెట్టారు సుకుమార్. స్మగ్లింగ్ వరల్డ్‌కు లీడర్‌గా పుష్ప ఎదిగిన విధానాన్ని ఇందులో చూపించబోతున్నారు సుక్కు.

ఈ సినిమాను ఇండియన్ భాషల్లోనే కాదు.. పారెన్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేయనున్నారు. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అల్లు అర్జున్ వెళ్లడం పుష్ప 2కు బాగా కలిసి రానుంది.




