Bollywood: బాలీవుడ్ హీరోలకే సాధ్యం కాని ఈ రికార్డును ఓ హీరోయిన్ కదిలించింది.
ఓ రికార్డ్ ఏడాదికి పోతుంది.. మరోటి రెండేళ్లకు పోతుంది.. ఇంకోటి మూడేళ్లకు పోతుంది.. చివరికి ఏ రికార్డైనా ఎప్పుడో ఓ సారి పోవాల్సిందే..! తాజాగా బాహుబలి 2 విషయంలోనూ ఇదే జరిగింది. ఏడేళ్ళుగా పదిలంగా ఉన్న రికార్డ్ ఒకటి ఇప్పుడు కదిలింది. బడా బడా బాలీవుడ్ హీరోలకే సాధ్యం కాని ఈ రికార్డును ఓ హీరోయిన్ కదిలించింది. ఇంతకీ ఏంటా రికార్డ్..? ఎవరా హీరోయిన్..? బాహుబలి 2 కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు.. అసలు సిసలైన పాన్ ఇండియన్ సినిమా.