- Telugu News Photo Gallery Cinema photos Deepika Padukone shows her pregnancy glow in new maternity shoot with Ranveer Singh see photos
Deepika Padukone: నిండు గర్భంతో దీపికా.. వైరల్‌గా మారిన లేటెస్ట్ ఫోటో షూట్..
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ త్వరలోనే అమ్మ నాన్నగా ప్రమోషన్ పొందనున్నారు. దీపికా గర్భవతి అని తెలిసిన దగ్గర నుంచి అభిమానులు ఆమె ఎప్పుడు బిడ్డకు జన్మనిస్తుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
Updated on: Sep 03, 2024 | 2:14 PM

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ త్వరలోనే అమ్మ నాన్నగా ప్రమోషన్ పొందనున్నారు. దీపికా గర్భవతి అని తెలిసిన దగ్గర నుంచి అభిమానులు ఆమె ఎప్పుడు బిడ్డకు జన్మనిస్తుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

దీపికా గర్భం దాల్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా ఫేక్ ప్రెగ్నెన్సీ వార్తలు వచ్చాయి. వీటన్నింటికి ముగింపు పలికేలా ప్రసూతి ఫోటోషూట్ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మెటర్నిటీ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిండు కడుపుతో ఉన్న దీపిక చిత్రాల పై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ తల్లిదండ్రులు కావడం ఆనందంగా ఉంది అంటూ ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు. గతంలో దీపికా పై చాలా కామెంట్స్ వచ్చాయి.

సరోగసీ ద్వారా దీపిక తల్లి కాబోతోందని, బేబీ బంప్ పేరుతో దిండు పెట్టుకుంటోందని విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఫొటోలతో ట్రోలర్స్ కు గట్టి సమాధానం చెప్పారు ఈ స్టార్ కపుల్. ఇద్దరూ తమ ఫోటోలకు ఎమోజీలతో క్యాప్షన్ ఇచ్చారు. చాలా మంది అభిమానులు ఈ స్టార్ కపుల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఫిబ్రవరి 29న అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్‌ల వివాహం సందర్భంగా దీపికా పదుకొణె గర్భంతో కనిపించింది. ఆతర్వాత దీపికా నటించిన కల్కి సినిమా ప్రమోషన్స్ లో కనిపించింది. ఇక ఇప్పుడు ఇలా ఫోటో షూట్‌ను పంచుకుంది.




