- Telugu News Photo Gallery Cinema photos Hero Jr.NTR next movie with prashanth neel workouts, details here Telugu Heroes Photos
Jr.NTR: ఆచి తూచి అడుగులేస్తున్న దేవర.. వార్ 2 కూడా క్లోజ్. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ నే..
టైమ్ దొరికితే ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు? ఫ్యామిలీతో వెకేషన్‌కి వెళ్లడమో, మేకోవర్ అవ్వడమో అంటారా.? యస్.. అవి ఎలాగూ ఉంటాయి. వాటిని మించింది కూడా ప్లాన్ చేస్తారు స్టార్ హీరోలు. కాకపోతే కొన్నిసార్లు అవి జనాల్లోకి వస్తాయి.. మరికొన్ని సార్లు రావు.. అంతే తేడా.. లేటెస్ట్ గా ఎన్టీఆర్ టైమ్ స్పెండ్ చేయబోయే విధానం మాత్రం పాపులర్ అవుతోంది. ట్రిపుల్ ఆర్ లో భీమ్ కేరక్టర్లో చూసి చాన్నాళ్లయింది తారక్‌ని.
Updated on: Sep 03, 2024 | 3:03 PM

టైమ్ దొరికితే ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు? ఫ్యామిలీతో వెకేషన్‌కి వెళ్లడమో, మేకోవర్ అవ్వడమో అంటారా.? యస్.. అవి ఎలాగూ ఉంటాయి. వాటిని మించింది కూడా ప్లాన్ చేస్తారు స్టార్ హీరోలు.

కాకపోతే కొన్నిసార్లు అవి జనాల్లోకి వస్తాయి.. మరికొన్ని సార్లు రావు.. అంతే తేడా.. లేటెస్ట్ గా ఎన్టీఆర్ టైమ్ స్పెండ్ చేయబోయే విధానం మాత్రం పాపులర్ అవుతోంది.

యూరప్, బల్గేరియా సమీపంలోని బ్లాక్ సీ దగ్గరే ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. కేజియఫ్, సలార్‌కు భిన్నంగా ఎన్టీఆర్ సినిమా కథ ఉండబోతుందని తెలుస్తుంది. యాక్షన్ పార్ట్‌తో పాటు ఎమోషనల్ కంటెంట్ హెవీగా ఉండబోతుందని.. రెండు భాగాలుగా ఈ సినిమా రానుందని ప్రచారం జరుగుతుంది.

అది నిజమే అయితే గనక.. ఇకపై నల్ల సముద్రం అనే మాట చాలాసార్లు వింటారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2తో బిజీగా ఉన్నారు. అదేంటి యాంకర్ పార్ట్‌లోనేమో నల్ల సముద్రం అని.. ఇక్కడేమో ఎన్టీఆర్, వార్ 2 అంటూ ఏదేదో చెప్తున్నారు అనుకుంటున్నారా..?

ఇవి పూర్తి కాగానే, కొన్నాళ్ల పాటు కంప్లీట్‌గా కథలు వినాలనుకుంటున్నారు. అక్టోబర్ ఎండింగ్ వరకూ కొత్త కథల మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారట తారక్. అక్టోబర్‌లో ప్రశాంత్ నీల్ సినిమా మొదలవుతుంది.

అయితే తారక్ మాత్రం రెండు నెలల పాటు మేకోవర్‌కి టైమ్ తీసుకుని డిసెంబర్‌లో నీల్ సెట్స్ కి హాజరు కానున్నారు. అంతలో వార్2 పనులు, కొత్త కథలు వినే పనులు కంప్లీట్ చేసేయాలనే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు.




