Rashmika Mandanna: రూల్స్ బ్రేక్ చేస్తున్న క్రష్మిక.! ఆయన్ని చూస్తూ పెరిగి ఆయనతోనే సినిమా..
సౌత్ నుంచి నార్త్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్యూటీస్ అక్కడ కమర్షియల్ ఇమేజ్ తెచ్చుకున్న దాఖలాలు ఇంత వరకు లేవు. కానీ ఈ రూల్‌ను బ్రేక్ చేస్తున్నారు హ్యాపెనింగ్ బ్యూటీ రష్మిక మందన్న. సౌత్‌లో బిజీగా సినిమాలు చేస్తూనే నార్త్‌లో వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతున్నారు. అంతేకాదు ఈ సినిమాల విషయంలో చాలా ఎగ్జైట్ అవుతున్నారు శ్రీవల్లి. యానిమల్ సినిమాతో నార్త్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రష్మిక మందన్న, అక్కడ డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు.