- Telugu News Photo Gallery Cinema photos Heroine Rashi Singh latest sizzling photos in saree goes viral in social
అబ్బబ్బో హొయలు.. కుర్రాళ్లకు సెగలు.. రాశి సిజ్లింగ్ లుక్స్..
రాశి సింగ్ తెలుగు చిత్రాలలో పనిచేసిన నటి. ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో ఆది సాయికుమార్ సరసన శశి సినిమా ద్వారా అరంగేట్రం చేసింది. ఆమె తదుపరి చిత్రాలలో సంతోష్ శోభన్, శివ కందుకూరి, సుహాస్ లతో జతకట్టింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఈ వయ్యారి భామ. వాటిపై మీరు కూడా ఓ లుక్ వెయ్యండి.
Updated on: Nov 13, 2025 | 12:33 PM

5 జనవరి 1999న మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ పంజాబ్ సిక్కు కుటుంబంలో జన్మించింది అందాల తార రాశి సింగ్. సౌత్ సినిమాల్లో ఎక్కువగా నటించింది ఈ వయ్యారి. ముఖ్యంగా తెలుగు, తమిళం చిత్రాల్లో కథానాయికగా కనిపించింది.

చిన్నప్పటి నుంచి నటనపై మక్కువ ఉన్నందున తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ తన కలలను నిరవేర్చుకోవడానికి కష్టపడుతుంది. పెళ్లి సందడి, అంతకు మించి, అదిరింది వంటి కొన్ని చిత్రాల్లో ఈ ముద్దుగుమ్మ నటనకి అనేక ప్రశంసలను అందుకుంది.

2021లో ఆది సాయి కుమార్, సురభి పురాణిక్ జంటగా నటించిన శశి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ వయ్యారి. తర్వాత నటించిన ప్రేమ్ కుమార్ అనే చిత్రంలో తన నటనతో సినీ వీక్షకులను ఆకట్టుకుంది వయ్యారి భామ రాశి సింగ్.

2023లో ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారమైన పాపం పసివాడు సిరీస్ లో ప్రధాన పాత్రలో ఆకట్టుకుంది. 2024లో విడుదలైన భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రంతో తొలిసారి కథానాయకిగా వెండి తెరపై అలరించింది ఈ ముద్దుగుమ్మ. అది ఏడాది ప్రసన్న వదనం, బ్లైండ్ స్పాట్ అంటే రెండు చిత్రాల్లో కథానాయకిగా కనిపించింది.

ప్రస్తుతం ఆహాలో మంచి క్రేజ్ సంపాదించిన 3 రోజెస్ వెబ్ సిరీస్‌కి కొనసాగింపుగా వస్తున్న 3 రోజెస్ సీజన్ 2లో ఓ ప్రధాన పాత్రలో కనిపించనుంది ఈ వయ్యారి భామ. ఈ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు రాజ్ తరుణ్ సరసన ఓ సినిమా చేస్తుంది. అలాగే మరికొన్ని చిత్రాల్లో నటిస్తుంది.




