AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సుకుమారి స్పర్శతో వెన్నెల వజ్రం అవుతుందేమో.. గోర్జియస్ అనుపమ..

అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరు తెలియని వారుండరు. తెలుగులో ఈమెకు మాములు క్రేజ్ లేదు. ఆమె ప్రధానంగా తెలుగు, మలయాళం, తమిళ చిత్రాలలో కథానాయికగా నటిస్తుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది ఈ ముద్దగుమ్మ. ఇప్పుడు ఈ ఫోటోలను ఇంటర్నెట్‎లో తెగ వైరల్ అవుతున్నాయి. 

Prudvi Battula
|

Updated on: Nov 13, 2025 | 1:14 PM

Share
18 ఫిబ్రవరి 1996న కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లా ఇరింజలకుడాలో జన్మించింది అందాల భామ అనుపమ పరమేశ్వరన్. పరమేశ్వరన్ ఎరెక్కత్, సునీత పరమేశ్వరన్ దంపతులు ఈ వయ్యారి తల్లిదండ్రులు. ఆమెకు అక్షయ్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. కేరళలోని ఇరింజలకుడాలో డాన్ బాస్కో హయ్యర్ సెకండరీ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ ముద్దుగుమ్మ. కొట్టాయంలోని CMS కళాశాలలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌ల గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో సినిమా ఛాన్స్ రావడంతో దీన్ని మధ్యలో వదిలేసింది.

1 / 5
2015లో నివిన్ పౌలీతో కలిసి ప్రేమమ్‌ అనే మలయాళీ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. అది కమర్షియల్‌గా విజయం సాధించింది. జేమ్స్ & ఆలిస్ అడల్ట్ ఇసాబెల్ (పింకీ) పాత్ర చేసింది.  కోడి సినిమాతో తమిళంలో తొలిసారి నటించింది. ఈ సినిమా ఆ యావరేజ్ అయినప్పటికీ ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి.

2 / 5
2016లో నితీన్ సమంత జంట నటించిన అఆ అనే చిత్రంలో నాగవల్లి అనే పాత్రలో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ బ్యూటీ. దీనికి జీ సినీ అవార్డ్స్ తెలుగు వారిచే గర్ల్ నెక్స్ట్ డోర్ అవార్డును కైవసం చేసుకుంది. అదే ఏడాది తెలుగు ప్రేమమ్ సినిమాలోనూ ఓ హీరోయిన్ గా నటించింది. దీనికి IIFA ఉత్సవం ఉత్తమ సహాయ నటి – తెలుగు అవార్డు అందుకుంది. 

3 / 5
2017లో శతమానం భవతి చిత్రంలో కథానాయకిగా ఆకట్టుకుంది. తర్వాత ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు, కార్తికేయ 2 లాంటి మరికొన్ని తెలుగు హిట్ చిత్రాల్లో కధానాయికగా నటించింది. గత ఏడాది తెలుగు ఈగల్, టిల్లు స్క్వేర్ చిత్రాల్లో నటించింది. మధ్యలో మరికొన్ని చిత్రాల్లో కనిపించింది.

4 / 5
ఈ ఏడాది కోలీవుడ్ మూవీ డ్రాగన్‎లో ఆకట్టుకుంది. దీంతో పాటు  కిష్కింధపూరి, పరదా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. వీటిలో  కిష్కింధపూరికి మంచి రెస్పాన్స్ వచ్చింది. పరదా పర్వాలేదు అనిపించింది.  అలాగే మలయాళంలో  జానకి v/s స్టేట్ ఆఫ్ కేరళ, పెట్ డిటెక్టివ్ సినిమాలు కూడా చేసింది. తమిళంలో ఈమె హీరోయిన్‎గా నటించిన బైసన్ సినిమా ఇటీవల విడుదల అయింది. ఈ చిత్రం తమిళ్ సహా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. లాక్డౌన్ చిత్రాల్లో నటిస్తుంది ఈ బ్యూటీ.

5 / 5