- Telugu News Photo Gallery Cinema photos Prabhas Says His First Crush and Favorite Heroine In Telugu, Her Name Is Sai Pallavi
Prabhas : ప్రభాస్ ఫస్ట్ క్రష్ తనే.. ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టమట.. ఇంతకీ ఎవరంటే..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. డార్లింగ్ నటిస్తోన్న రాజాసాబ్, ఫౌజీ చిత్రాలపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. అయితే ఇప్పుడు డార్లింక్ పర్సనల్ విషయాల గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. ఇంతకీ ప్రభాస్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా.. ?
Updated on: Nov 13, 2025 | 3:02 PM

పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రభాస్. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్, హను రాఘవపూడితో కలిసి ఫౌజీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సినీరంగంలోకి ప్రభాస్ హీరోగా తెరంగేట్రం చేసి 23 ఏళ్లు అవుతుంది. ఈ క్రమంలోనే డార్లింగ్ హీరోగా పరిచయమైన సినిమా ఈశ్వర్. మరోవైపు డార్లింగ్ పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. 1979 అక్టోబర్ 23న జన్మించారు.

ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. తండ్రి పాపులర్ ప్రొడ్యూసర్. పెద్దనాన్ని కృష్ణంరాజు లెజెండరీ నటుడు. భీమవరంలో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత బీటెక్ కంప్లీట్ చేసి వైజాగ్ లోని సత్యానంద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి శిక్షణ తీసుకున్నాడు.

యితే స్కూల్ డేస్ లోనే తన ఫస్ట్ క్రష్ అని గతంలో మంచు లక్ష్మి నిర్వహించిన ఓ షోలో వెల్లడించాడు. క్లాస్ లో అన్ని సబ్జెక్టులు చెప్పే టీచర్ అంటే తనకు క్రష్ అని చెప్పుకొచ్చాడు ప్రభాస్. అలాగే ఈ జనరేషన్ లో తనకు ఇష్టమైన హీరోయిన్ సాయి పల్లవి అని చెప్పి షాకిచ్చాడు.

అలాగే సీనియర్ హీరోయినల్లో తనకు సావిత్రి అంటే ఇష్టమని...ఆమె తన ఆల్ టైమ్ ఫేవరేట్ హీరోయిన్ అని అన్నారు ప్రభాస్. చిన్నప్పటి నుంచి సావిత్రి సినిమాలు ఎక్కువగా చూసేవాడినని తెలిపారు. ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు.




