Villains: హీరో కమ్ విలన్లు.. ప్రతి నాయకులుగా మారుతున్న హీరోలు..
ఎప్పుడూ చేసిందే చేస్తే ఏం బావుంటుందబ్బా... అప్పుడప్పుడూ కొత్తగా చేయాలి. అయితే మన ప్లేస్‌లో. లేకుంటే, కాస్త ప్లేస్ మార్చి కొత్త ప్లేస్లో... ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడైనా వెరైటీగా కనిపించకపోతే మనకి మనమే బోర్ కొడతాం కదా... అని అంటున్నారు కొందరు హీరోలు.. సారీ విలన్లు.. సారీ.. సారీ..! హీరో కమ్ విలన్లు.. ప్రతి నాయకులుగా మారుతున్న ప్రతి నాయకుడి గురించి డీటైల్డ్ గా మాట్లాడుకుందాం వచ్చేయండి,...
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Apr 24, 2024 | 9:00 AM

హీరో కేరక్టర్లు ఎప్పుడూ చేసేవే.. ఫర్ ఎ చేంజ్ విలన్‌గా చేస్తే అని అనుకున్నారు తారక్. జై లవకుశలో విలన్‌గా మెప్పించారు. ఆ సినిమాలో ఆయన యాక్టింగ్ చూసిన నార్త్ మేకర్స్ ఇప్పుడు వార్2లోనూ నెగటివ్ ఛాయలున్న కేరక్టర్‌కి ఫిక్స్ చేశారు. మన టైగర్ ఇప్పుడు నార్త్ లో విలన్‌గా చేస్తున్నారన్నమాట.

అలాగే నార్త్ లో నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణంలో రావణాసురుడిగా మెప్పించడానికి రెడీ అవుతున్నారు యష్. కేజీయఫ్‌లో ఆయనే హీరో అయినా, గ్రే షేడ్స్ బాగానే కనిపించాయి జనాలకు.

యానిమల్ సినిమా క్లైమాక్స్ చూసిన వారికి యానిమల్ పార్క్ లో విలన్ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన జై లవకుశలో హీరో, విలన్ తారక్ చేసినట్టు, యానిమల్ పార్క్ లోనూ హీరో, విలన్‌గా మెప్పించడానికి రెడీ అవుతున్నారు రణ్‌బీర్‌కపూర్. 2026లో తెరకెక్కే యానిమల్ పార్క్ కోసం ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

రీసెంట్ రిలీజ్ సలార్‌లో ప్రభాస్‌కి ఆత్మీయుడిగా కనిపించిన పృథ్విరాజ్ సుకుమారన్, నెక్స్ట్ పార్ట్ లో విలన్‌గా కనిపిస్తారు. పార్టీ లేదా పుష్పా అనే ఒకే ఒక్క డైలాగ్‌తో తెలుగు ఆడియన్స్ మనసుల్లో అగ్రస్థానం సంపాదించుకున్న ఫాహద్... పృథ్విరాజ్‌లాగానే మలయాళంలో మంచి మాస్‌హీరోనే.

ఎక్కడిదాకో ఎందుకు... ఇప్పుడు టాప్‌లో ట్రెండ్ అవుతోన్న కల్కి సినిమాలో యూనివర్శల్ స్టార్ కమల్‌హాసన్ విలన్‌గా కనిపించనున్నారు. ఓ వైపు హీరోగా కంటిన్యూ అవుతూనే, ప్యాన్ ఇండియన్ సినిమాలో విలన్‌గా నటించడానికి ఒప్పుకోవడం మామూలు విషయం కాదన్నది అప్పట్లో బాగా వైరల్ అయిన మాట. ఈ సినిమాలన్నీ సక్సెస్ అయితే, ఫర్ ఎ చేంజ్... ప్రతి నాయకుడిగా కనిపించడానికి ప్రతి.. నాయకుడూ ముందుకొస్తారేమో... లెట్స్ వెయిట్ అండ్ సీ...





























