- Telugu News Photo Gallery Cinema photos Hero Vishal Movie Thupparivaalan 2 update full details here Telugu Entertainment Photos
Vishal: విశాల్ తుప్పరివాలన్ 2 అటకెక్కిందా..? అసలేం జరిగిందంటే..!
నేను కాబట్టి తట్టుకున్నాను ఇంకో నిర్మాత అయితే హార్ట్ ఎటాక్‌తో పోయేవాడు అంటూ ఓ దర్శకుడి మీద సీరియస్ కామెంట్స్ చేశారు కోలీవుడ్ స్టార్ హీరో విశాల్. తనకు హిట్ ఇచ్చిన ఓ దర్శకుడి మీద పీకలదాక కోపంతో ఊగిపోతున్నారు విశాల్. ఇంతకీ ఎవరా దర్శకుడు..? ఏంటా గొడవ అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి. విశాల్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ తుప్పరివాలన్..
Updated on: Sep 15, 2023 | 3:33 PM

నేను కాబట్టి తట్టుకున్నాను ఇంకో నిర్మాత అయితే హార్ట్ ఎటాక్‌తో పోయేవాడు అంటూ ఓ దర్శకుడి మీద సీరియస్ కామెంట్స్ చేశారు కోలీవుడ్ స్టార్ హీరో విశాల్. తనకు హిట్ ఇచ్చిన ఓ దర్శకుడి మీద పీకలదాక కోపంతో ఊగిపోతున్నారు విశాల్. ఇంతకీ ఎవరా దర్శకుడు..? ఏంటా గొడవ అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి.

విశాల్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ తుప్పరివాలన్. తెలుగులో డిటెక్టివ్ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. అందుకే వెంటనే ఈ సినిమాకు సీక్వెల్‌ను ఎనౌన్స్ చేశారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన మిస్కిన్ దర్శకత్వంలోనే సీక్వెల్‌ను స్టార్ట్ చేశారు.

తొలి భాగం విషయంలో అంతా సవ్యంగానే జరిగినా, సీక్వెల్ విషయంలో మాత్రం హీరో, డైరెక్టర్ మధ్య వివాదాలు మొదలయ్యాయి. దీంతో తుప్పరివాలన్ 2 ప్రాజెక్ట్‌ను టెంపరరీగా పక్కన పెట్టిన విశాల్, త్వరలో ఓన్ డైరెక్షన్‌లో ఆ సినిమా చేస్తానని ఎనౌన్స్ చేశారు.

రీసెంట్‌గా మిస్కిన్‌తో వివాదంపై మరోసారి స్పందించారు విశాల్. అతనితో వర్క్ చేసే సమయంలో నిర్మాతగా తాను ఎంతో ఇబ్బంది పడ్డానని చెప్పారు. అందుకే ఇక మీద అతడితో కలిసి వర్క్ చేయకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు.

మిస్కిన్ ఫైనల్ చేసిన తుప్పరివాలన్ 2 స్క్రిప్ట్‌కు మార్పులు కూడా చేస్తున్నారు విశాల్. ముందుగా అనుకున్న స్క్రిప్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి... తన స్టైల్ ఆఫ్ ట్రీట్‌మెంట్‌తో ఫైనల్ వర్షన్‌ను రెడీ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.




