AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja – Eagle: మా సోలో డేట్ ఎక్కడ.. బాంబ్ పేల్చిన ఈగల్ టీం.

ఈగల్ నిర్మాతలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి సమాధానం చెప్పబోతుంది..? అనుకున్నట్లుగానే సోలో రిలీజ్ డేట్ ఇప్పిస్తారా.. ఇప్పించగలరా..? ఒక్కర్ని అంటే మ్యానేజ్ చేసారు కానీ అందర్నీ ఒకేసారి వాళ్లు మ్యానేజ్ చేయగలరా..? తమకు సోలో డేట్ కావాలంటున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి నిర్మాతల మండలి ఏం చెప్పబోతున్నారు..? సంక్రాంతి రచ్చ ఇంకా అయిపోలేదు.. ఆ మధ్య ఈగల్ సినిమా వాయిదా పడింది కదా.. కాదు కాదు అంతా కలిసి మాట్లాడుకుని వాయిదా వేయించారు.

Anil kumar poka
|

Updated on: Jan 21, 2024 | 3:25 PM

Share
ఈగల్ నిర్మాతలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి సమాధానం చెప్పబోతుంది..? అనుకున్నట్లుగానే సోలో రిలీజ్ డేట్ ఇప్పిస్తారా.. ఇప్పించగలరా..? ఒక్కర్ని అంటే మ్యానేజ్ చేసారు కానీ అందర్నీ ఒకేసారి వాళ్లు మ్యానేజ్ చేయగలరా..? తమకు సోలో డేట్ కావాలంటున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి నిర్మాతల మండలి ఏం చెప్పబోతున్నారు..?

1 / 7
సంక్రాంతి రచ్చ ఇంకా అయిపోలేదు.. ఆ మధ్య ఈగల్ సినిమా వాయిదా పడింది కదా.. కాదు కాదు అంతా కలిసి మాట్లాడుకుని వాయిదా వేయించారు. పైగా సోలో డేట్ ఇప్పిస్తామంటూ మాటిచ్చారు. తీరా ఇప్పుడు పరిస్థితులు అలా లేవు.

2 / 7
దాంతో ఈగల్ నిర్మాతలు మరోసారి తమ హక్కు కోసం పోరాటం మొదలుపెట్టారు.. పైగా థియేటర్స్ కోసం ఇంకా పీకులాట సాగుతూనే ఉంది.  రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈగల్ సినిమా జనవరి 13న విడుదల కావాల్సి ఉన్నా..

3 / 7
పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మాట్లాడి ఫిబ్రవరి 9కి వాయిదా వేయించారు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు. పండక్కి 4 సినిమాలున్నాయి కాబట్టి తర్వాత సోలో డేట్ ఇప్పిస్తామని మాటిచ్చారు.. కానీ అదే ఫిబ్రవరి 9కి మూడు సినిమాలు వస్తున్నాయి.. ముందు రోజు కూడా ఓ సినిమా వస్తుంది.

4 / 7
ఈగల్ వాయిదా వేసారు కాబట్టి ఫిబ్రవరి 9న రావాల్సిన తన టిల్లు స్క్వేర్‌ను వాయిదా వేసారు నిర్మాత నాగవంశీ. అక్కడితో ఆయన పని అయిపోయింది.. కానీ అదే పని మిగిలిన నిర్మాతలు కూడా చేయాలిగా..! అక్కడే అసలు తగాదా వస్తుంది.

5 / 7
హాస్య మూవీస్ నుంచి వస్తున్న ఊరి పేరు భైరవకోన ఫిబ్రవరి 9నే రానుంది.. ఇక యాత్ర 2 సైతం ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఫిబ్రవరి 9నే రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న లాల్ సలామ్ కూడా రానుంది. ఐశ్వర్య రజినీకాంత్ దీనికి దర్శకురాలు.

6 / 7
తమకు సోలో డేట్ ఇప్పిస్తామని చెప్పిన ఫిల్మ్ ఛాంబర్‌కు ఇప్పుడు లెటర్ రాసారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మీ మాట నమ్మే వాయిదా వేసాం కాబట్టి మీరే సోలో డేట్ ఇప్పించండి అంటున్నారు వాళ్లు. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?

7 / 7
Follow Us