- Telugu News Photo Gallery Cinema photos Craze for repeat combinations is increasing in Tollywood Film Industry
Repeat Combinations: టాలీవుడ్‌లో రిపీట్ కాంబినేషన్స్.. అసలు ఎవరు ఎవరితో సినిమాలు చేస్తున్నారు..?
టాలీవుడ్‌లో రిపీట్ కాంబినేషన్స్‌కు క్రేజ్ బాగా పెరిగిపోతుంది. ముందు సినిమా హిట్ ఫ్లాపులతో పనిలేకుండా దర్శకులను మాత్రం గుడ్డిగా నమ్మేస్తున్నారు హీరోలు. కథ నచ్చితే.. ట్రాక్ రికార్డ్ చూడకుండా ఛాన్సిచ్చేస్తున్నారు. తాజాగా మరో కాంబినేషన్ కూడా రిపీట్ కాబోతుంది.. మరి అదేంటి..? అసల ఎవరు ఎవరితో సినిమాలు చేస్తున్నారు..? హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా రవితేజకు, నాగార్జున, నాని, అల్లు అర్జున్ రిపీట్ కాంబినేషన్స్‌కే ఓటేస్తున్నారు.
Updated on: Jan 21, 2024 | 2:44 PM

టాలీవుడ్‌లో రిపీట్ కాంబినేషన్స్‌కు క్రేజ్ బాగా పెరిగిపోతుంది. ముందు సినిమా హిట్ ఫ్లాపులతో పనిలేకుండా దర్శకులను మాత్రం గుడ్డిగా నమ్మేస్తున్నారు హీరోలు. కథ నచ్చితే.. ట్రాక్ రికార్డ్ చూడకుండా ఛాన్సిచ్చేస్తున్నారు. తాజాగా మరో కాంబినేషన్ కూడా రిపీట్ కాబోతుంది.. మరి అదేంటి..? అసల ఎవరు ఎవరితో సినిమాలు చేస్తున్నారు..?

హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా వరస సినిమాలు చేయడం మాత్రమే రవితేజకు తెలిసిన పని. ఇప్పుడూ ఇదే చేస్తున్నారీయన. ఈగల్ రిలీజ్‌కు రెడీగా ఉండగానే.. హరీష్ శంకర్‌తో మిస్టర్ బచ్చన్ మొదలుపెట్టారు. మిరపకాయ్ వచ్చిన 12 ఏళ్ళకు ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది.

మరోవైపు నాగార్జున కూడా నా సామిరంగ ఫేమ్ విజయ్ బిన్నికి మరో ఛాన్స్ ఇచ్చారని తెలుస్తుంది. నా సామిరంగను మూడు నెలల్లోనే తీసి ఔరా అనిపించారు విజయ్ బిన్ని. ఆయన వర్క్ నచ్చి నాగార్జున అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.

మరోవైపు నాని కూడా రిపీట్ కాంబినేషన్స్‌కే ఓటేస్తున్నారు. ప్రస్తుతం అంటే సుందరానికి ఫేమ్ వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు. గ్యాంగ్ లీడర్ బ్యూటీ ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్.అలాగే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతోనూ ఓ సినిమా చేయబోతున్నారు నాని. ఈ చిత్రం త్వరలోనే మొదలు కానుంది.

ఇక అల్లు అర్జున్‌తో త్వరలోనే 4వ సినిమా చేయబోతున్నారు గురూజీ. ఈ కాంబోపై అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. బోయపాటి, బాలయ్య సైతం 4వ సారి కలిసి పని చేయబోతున్నారు. ఇలా మొత్తానికిప్పుడు రిపీట్ కాంబినేషన్స్ టైమ్ నడుస్తుంది.




