- Telugu News Photo Gallery Cinema photos Hero Nani New Strategy For Upcoming Movies, details here Telugu Heroes Photos
Nani: యూటర్న్ తీసుకుంటున్న నేచురల్ స్టార్.! ఇదే కొత్త స్ట్రాటజీ..
యంగ్ హీరో నాని కంప్లీట్‌గా యూటర్న్ తీసుకోబోతున్నారా..? ప్రజెంట్ యాక్షన్ ట్రెండ్‌లో ఉన్న నేచురల్ స్టార్ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళుతున్నారా..? అప్ కమింగ్ సినిమాతో మరోసారి తన స్ట్రెంగ్త్ చూపించేందుకు రెడీ అవుతున్నారా..? ఇదే ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో ట్రెండింగ్ డిస్కషన్. దసరా సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న నాని రీసెంట్‌గా హాయ్ నాన్నతో మరో డీసెంట్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.
Updated on: Apr 15, 2024 | 3:53 PM

యంగ్ హీరో నాని కంప్లీట్‌గా యూటర్న్ తీసుకోబోతున్నారా..? ప్రజెంట్ యాక్షన్ ట్రెండ్‌లో ఉన్న నేచురల్ స్టార్ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళుతున్నారా..? అప్ కమింగ్ సినిమాతో మరోసారి తన స్ట్రెంగ్త్ చూపించేందుకు రెడీ అవుతున్నారా..?

ఇదే ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో ట్రెండింగ్ డిస్కషన్. దసరా సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న నాని రీసెంట్‌గా హాయ్ నాన్నతో మరో డీసెంట్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

అయితే ఈ రెండు సినిమాల్లోనూ నాని కోర్ స్ట్రెంగ్త్ అయిన కామెడీ కాస్త తక్కువగానే ఉంది. ప్రజెంట్ వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో సరిపోదా శనివారం అనే యాక్షన్ మూవీ చేస్తున్నారు నేచురల్ స్టార్.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చూస్తే ఈ సినిమాలో కూడా కామెడీకి పెద్దగా స్కోప్ ఉండే ఛాన్స్ లేనట్టుగానే అనిపిస్తోంది. అందుకే వరుసగా సీరియస్ రోల్స్ చేసి బోర్ ఫీల్ అయిన నాని, నెక్ట్స్ చేయబోయే సినిమాలో యూటర్న్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.

సుజిత్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేస్తున్నారు నాని. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సుజిత్ తరువాత సాహో సినిమాతో యాక్షన్ టర్న్ తీసుకున్నారు.

ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న ఓజీని కూడా అదే జానర్‌లో చేస్తున్నారు. అందుకే సుజిత్ కూడా కాస్త రిలీఫ్ కోసం మళ్లీ కామెడీ మూవీ చేసే ఆలోచనలో ఉన్నారు.

హీరో, డైరెక్టర్ ఇద్దరూ యాక్షన్ జానర్‌ను పక్కన పెట్టి కామెడీ టర్న్ తీసుకోవటంతో, అప్ కమింగ్ సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అవుతోంది. ఎలాగూ కామెడీ టైమింగ్ విషయంలో నానికి తిరుగుండదు కాబట్టి మరో బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు నేచురల్ స్టార్ ఫ్యాన్స్.





























