- Telugu News Photo Gallery Cinema photos Hero Mithun Chakraborty built a farm house specially for dogs
కుక్కలకు కోట్ల ఆస్తి రాసిచ్చిన స్టార్ హీరో.. చివరకు వాటి కోసం..
పెంపుడు జంతువులను ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది వానిని ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. మరీ ముఖ్యంగా కుక్కను చాలా మంది ప్రేమగా పెంచుకుంటారు. దానిని కూడా ఓ ఫ్యామిలీ మెంబర్‌గా చూస్తూ, మంచి ఫుడ్ పెట్టడం, బర్త్ డే చేయడం, ఫంక్షన్స్‌కి తీసుకెళ్లడం చేస్తారు. కానీ ఎప్పుడైనా కుక్కలకు ఆస్తిరాసివ్వడం గురించి విన్నారా? కానీ ఇక్కడ ఓ హీరో ఏకంగా తన పెంపుడు కుక్కలకు ఆస్తినే రాసిచ్చాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా?
Updated on: Mar 02, 2025 | 11:52 AM

బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన 1980లో తన నటనతో బాలీవుడ్‌నే షేక్ చేశాడు . వరస సినిమాలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని స్టార్‌గా ఓ వెలుగు వెలిగాడు. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

చాలా పేద కుటుంబంలో పుట్టిన ఈ హీరోగా ఎంట్రీ ఇచ్చి, తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు . తర్వాత అనేక ఆస్తులు కూడా సంపాదించుకున్నాడు. అయితే ఈయనకు కుక్కలు అంటే చాలా ఇష్టం అంట. అయితే తాజాగా ఈయన కోడలు తన మామ అయిన మిథున్ చక్రవర్తి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపింది.

మా మామగారికి కుక్కులు అంటే అమితమైన ప్రేమ. అందుకే ఈయన ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 116 కుక్కలను పెంచుకుంటున్నాడని తెలిపింది.అంతే కాకుండా ఇక్కడ విచిత్రమేమిటంటే , వాటికి తన ఆస్తిని కూడా రాసిచ్చాడంట. వాటి మీద ఉన్న ప్రేమతో వాటికి విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టేసి తన కుక్కలకు లగ్జరీ లైఫ్ ఇస్తున్నాడంట.

ఈ హీరో దాదాపు తన కుక్కలు కోసం ప్రత్యేకంగా 45 కోట్ల ఆస్తిని కే టాయించాడంట. ఇది సపరేట్‌గా వాటికోసమే కేటాయించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వీటి కోసం స్పెషల్ గదులు కట్టించి వాటికి సంరక్షణ ఇస్తున్నాడంట .

అంతే కాకుండా కుక్కలు చిన్న పిల్లలానే, వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతాడంట. తన పెంపుడు కుక్కలను కంటికి రెప్పలా చూసుకుంటాడంట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.



