Hebah Patel: బ్లాక్ కలర్ శారీలో బీభత్సం సృష్టిస్తున్న హెబ్బా పటేల్
అందం అభినయం ఉన్న హీరోయిన్స్ గా రాణించలేక పోతున్న భామల్లో హెబ్బాపటేల్ ఒకరు. అలా.. ఎలా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హెబ్బా పటేల్. సినిమా హిట్ కాకపోయినా హెబ్బా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లోన్ కుమారి 21 ఎఫ్ అనే సినిమాలో నటించింది. కుమారి 21 ఎఫ్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తన అందంతో కవ్వించింది. అంతే కాదు ఈ సినిమాలో హెబ్బా పటేల్ తన నటనతోనూ ఆకట్టుకుంది.
Updated on: Aug 30, 2023 | 7:55 AM

అందం అభినయం ఉన్న హీరోయిన్స్ గా రాణించలేక పోతున్న భామల్లో హెబ్బాపటేల్ ఒకరు. అలా.. ఎలా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హెబ్బా పటేల్. సినిమా హిట్ కాకపోయినా హెబ్బా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఆ తర్వాత సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లోన్ కుమారి 21 ఎఫ్ అనే సినిమాలో నటించింది. కుమారి 21 ఎఫ్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తన అందంతో కవ్వించింది. అంతే కాదు ఈ సినిమాలో హెబ్బా పటేల్ తన నటనతోనూ ఆకట్టుకుంది.

ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. దాంతో మెల్లగా ఈ భామకు అవకాశాలు తగ్గాయి. దాంతో స్పెషల్ సాంగ్స్ లో స్టెప్పులేస్తూ అలరిస్తుంది హెబ్బాపటేల్.

ఇక ఈ అమ్మడు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ కలర్ శారీలో మెరిసింది హెబ్బా పటేల్. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలకు కుర్రళ్లు ఫిదా అవుతున్నారు. హెబ్బాను చూస్తూ అబ్బా అనాలనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు. ఈ అమ్మడు తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లకోసం ఎదురుచూస్తుంది. ఆ దిశగా గట్టిగానే ప్రయత్నిస్తుంది.





























