ఫుల్ ఖుషిలో డార్లింగ్ ఫ్యాన్స్..రాజాసాబ్‌పై క్లారిటీ వచ్చినట్లేనా?
రాజాసాబ్ సినిమాకు సంబంధించి ఇప్పుడు చాలా విషయాల్లో క్లారిటీ కనిపిస్తోంది. సినిమా రిలీజ్ ఎప్పుడు? నార్త్ ఏమంటోంది? సౌత్ ఎలా కోరుకుంటోంది? నిడివి ఎంత వచ్చింది? రెండు పార్టులుంటాయా? ఇలా... ఓపిగ్గా ఎన్ని డౌట్స్ అయినా అడగండి.. ఆన్సర్లు రెడీ అంటున్నారు మేకర్స్.
Updated on: Aug 14, 2025 | 7:45 PM

రాజాసాబ్ సినిమాకు సంబంధించి ఇప్పుడు చాలా విషయాల్లో క్లారిటీ కనిపిస్తోంది. సినిమా రిలీజ్ ఎప్పుడు? నార్త్ ఏమంటోంది? సౌత్ ఎలా కోరుకుంటోంది? నిడివి ఎంత వచ్చింది? రెండు పార్టులుంటాయా? ఇలా... ఓపిగ్గా ఎన్ని డౌట్స్ అయినా అడగండి.. ఆన్సర్లు రెడీ అంటున్నారు మేకర్స్.

ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ 2025 రిలీజ్ ఉంటుందా? ఉండదా? ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన సినిమా...పోస్ట్ పోన్ అయి సమ్మర్‌లో ల్యాండ్ అయింది. మళ్లీ అక్కడి నుంచి వాయిదా పడి... డిసెంబర్ 5కి ఫిక్స్ అయింది. ఈ సినిమా అప్పుడైనా రిలీజ్ అవుతుందా? మరోసారి వాయిదా పడుతుందా? అన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం.

మా డార్లింగ్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడమే కరెక్ట్.. జనవరి 9కి ఫిక్సవ్వండి అంటూ రిక్వెస్టులు అందుతున్నాయట మేకర్స్ కి. అటు నార్త్ వాళ్లు మాత్రం డిసెంబర్‌లో ఎక్కువ స్పేస్ ఉంది.. చెప్పిన టైమ్‌కే వచ్చేయండి అని అంటున్నారట. ఏవో కొన్ని పాటలు తప్ప, షూటింగ్ ని దాదాపుగా పూర్తి చేసుకుంది రాజాసాబ్. అన్నీ కలిపినా అక్టోబర్ ఎండ్‌కి సెట్స్ మీద వర్క్ పూర్తయిపోతుందట.

ఇప్పటికైతే నాలుగున్నర గంటల ఫుటేజ్ ఉంటుందట. దాన్ని క్లాస్, మాస్ ఆడియన్స్ కి తగ్గట్టు ఫుల్ మీల్స్ లాగా ఎడిట్ చేయాలన్నది మేకర్స్ ముందున్న టాస్క్. పార్ట్ 2 కచ్చితంగా ఉందంటున్నారు నిర్మాత విశ్వప్రసాద్.

హారర్ కామెడీ నేపథ్యంలో ముస్తాబవుతోంది ది రాజా సాబ్. ఆల్రెడీ విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి స్పందన వస్తోంది. హవేలీ రాజ్ మహల్ సెట్‌ను టీమ్ ఇప్పటికే రివీల్ చేసింది. సినిమా మొత్తానికీ ఈ సెట్ స్పెషల్ అట్రాక్షన్ కానుంది. డార్లింగ్ కెరీర్‌లో డిఫరెంట్ మూవీ అవుతుందనే కాన్ఫిడెన్స్ ట్రేడ్ వర్గాల్లోనూ బాగా కనిపిస్తోంది.




