- Telugu News Photo Gallery Cinema photos Geetha madhuri warns about mis using her name and photos in whatsapp Telugu Entertainement News
Geetha Madhuri: అందరినీ వార్న్ చేసిన గీతామాధురి.. వాట్సాప్ మెసేజులు చేయద్దంటూ రెక్వెస్ట్..
Geetha Madhuri: టాలీవుడ్ లో సింగర్ గీతా మాధురి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన పాటలతో పలు సినిమాల్లో హిట్ సాంగ్స్ తో పాటు మాస్ సాంగ్స్ కూడా పాడి బాగా పేరు పొందారు. సినిమా పాటలతో పాటు, స్టేజ్ షోలు, రియాలిటీ షోలతో పేరు సంపాదించుకున్న గీతామాధురికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.
Updated on: Jul 20, 2022 | 5:05 PM

సైబర్ నేరగాళ్ల ఆటలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. నెటిజన్లను మోసపోయేలా చేస్తున్నాయి. అయితే సైబర్ పోలీస్ విభాగం ఇలాంటి మోసాలపై ఎంత అవగాహన కల్పించినా.. నెటిజన్లు మాత్రం జాగ్రత్తగా ఉండడం లేదు.

పోలీసులను వేడుకోవడం ఏమాత్రం ఆపడం లేదు. ఇక సెలబ్రిటీల పేరుతో మోసం చేస్తున్న కేటుగాళ్లు హద్దులు మీరుతున్నారు.

ఫారెన్ నెంబర్‌తో.. సెలబ్రిటీల ఫోటోలతో.. వాట్సాప్ చాట్‌లు చేస్తున్నారు.. అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. వారి వారి పర్సనల్ డాటాను కూడా రాబడుతున్నారు.

అలా తాజాగా తన పేరుతో సైబర్‌నేరగాళ్లు వాట్సాప్ చాట్ చేస్తున్నారని అందర్నీ వార్న్ చేశారు స్టార్ సింగర్ గీతామాధురి.ఇండస్ట్రీలో మాస్ అండ్ క్లాస్ సాంగ్స్‌తో పాపులర్ అయ్యారు స్టార్ గీతామాధురి.

ఆ తరువాత హీరో నందును పెళ్లి చేసుకుని అటు మ్యారీడ్ లైఫ్లోను ఇటు సింగింగ్ కెరీర్ లోనూ బిజీగా మారియారు. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 2 లోకి ఎంట్రీ ఇచ్చి.. రన్నరప్ గా నిలిచారు.

బుల్లి తెరపై విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. స్టార్ హీరోల సినిమాలకు పాడేస్తూ.. అంచలంచెలుగా ఎదుగుతున్నారు. ఈక్రమంలోనే తన పేరు మీదు ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయాని సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు గీతామాధురి.

తన ప్రొఫైల్ పిక్ ఉన్న ఓ అమెరికా నెంబర్‌తో వాట్సాప్ మెసేజులు వస్తున్నాయని.. ఆ మెసేజ్‌లకు రెస్పాండ్ అవ్వద్దని తన ఫ్యాన్స్ ను కోరారు. ఇక ఇప్పటికే వాట్సాప్ చాటింగులు చేస్తున్న వారు వెంటనే ఆ నెంబర్‌ను బ్లాక్ చేయాలని సూచించారు.

ఇక ఇదే విషయాన్ని సైబర్ పోలీసుల దృష్టికి కూడా తీసుకెళుతున్నట్టు ఆమె చెప్పారు.ఇక ఇంతకు ముందు సింగర్ సునీత, రమ్య బెహ్రా విషయంలోనూ ఇదే జరిగింది.

ఈస్టార్ సింగర్స్ ప్రొఫల్ పిక్ ఉన్న నెంబర్‌తో ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి వాట్సాప్ మెసేజులు వెళ్లాయి. అయితే ఇది సైబర్ నేరగాళ్ల పని అని ఎవరూ ఆ మెసేజులకు రెస్పాండ్ అవ్వద్దని వారు సోషల్ మీడియాలో చెప్పడంతో.. అవి ఆగిపోయాయి.





























