- Telugu News Photo Gallery Cinema photos Game Changer to Tillu square latest film updates from tollywood
Tollywood Updates: గేమ్ ఛేంజర్ నుంచి కేజ్రీ అప్‌డేట్.. రాధిక ఓ రాధిక అంటున్న టిల్లు..
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ తాజాగా మైసూర్‌లో జరుగుతుంది. డిజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయిన హీరో సిద్ధు జొన్నలగడ్డ. ప్రస్తుతం ఈయన వరస సినిమాలు చేస్తున్నారు. కార్తీక్ రాజు హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ అథర్వ. డిసెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది. హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా వరస సినిమాలు చేస్తూనే ఉన్నారు మాస్ రాజా రవితేజ. ప్రస్తుతం జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్.
Updated on: Nov 28, 2023 | 8:42 AM

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ తాజాగా మైసూర్‌లో జరుగుతుంది. ఈ మధ్యే సెట్‌లోకి రామ్ చరణ్ కూడా అడుగు పెట్టారు. తాజాగా ఈ షెడ్యూల్ గురించి మరో అప్డేట్ వచ్చింది. శంకర్, చరణ్ ఇప్పటికే సెట్స్‌లో ఉన్నారు. తాజాగా సినిమాలో కీలక పాత్రలు చేస్తున్న ఎస్ జె సూర్య, సునీల్, 30 ఇయర్స్ పృథ్వీ లాంటి నటులు కూడా జాయిన్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. మరికొన్ని రోజులు ఈ షూటింగ్ జరగనుంది.

డిజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయిన హీరో సిద్ధు జొన్నలగడ్డ. ప్రస్తుతం ఈయన వరస సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఈయన హీరోగా నటిస్తున్న సినిమా టిల్లు స్క్వేర్. దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా అనుకున్న దానికంటే కాస్త ఆలస్యంగా వస్తున్నా.. ప్రమోషన్స్ మాత్రం అస్సలు ఆపట్లేదు. తాజాగా ఈ చిత్రం నుంచి రాధిక అంటూ సాగే ప్రోమో సాంగ్ విడుదలైంది. ఫుల్ సాంగ్ నవంబర్ 27 న విడుదల కానుంది.

కార్తీక్ రాజు హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ అథర్వ. డిసెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహేష్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి KCPD అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేసారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తుంది అథర్వ.

హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా వరస సినిమాలు చేస్తూనే ఉన్నారు మాస్ రాజా రవితేజ. తాజాగా ఈయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. గోపీచంద్ మలినేని సినిమా సెట్స్‌పై ఉండగా.. హరీష్ శంకర్, కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. తాజాగా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీతో రవితేజ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. దీని తర్వాత కూడా వరస సినిమాలు కమిటవుతున్నారు ఈయన. అందులో భాగంగానే లోకేష్ కనకరాజ్ సినిమా అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. ఈ సినిమాను డిసెంబర్ 12 రజినీ పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా మొదలు పెడతారని తెలుస్తుంది. ఈ మధ్యే లియోతో మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు లోకేష్.




