- Telugu News Photo Gallery Cinema photos Full discussion on Heroine Janhvi Kapoor south movies entry in Bollywood Telugu Actress Photos
Janhvi Kapoor: జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీపై నార్త్‌లో డిస్కషన్.. ఎందుకలా..?
జాన్వీ సౌత్ ఎంట్రీ గురించి నార్త్‌లో కూడా చాలా డిస్కషన్ జరుగుతోంది. అందుకే ఈ బ్యూటీ మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారి దేవరకు సంబంధించిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి. జాన్వీ కూడా ప్రతీ ఇంటర్వ్యూలోనూ తన సౌత్ ఎంట్రీ గురించి గొప్పగా చెబుతున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో జాన్వీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తారన్న ప్రచారం ఎప్పుడో మొదలైంది.
Updated on: May 27, 2024 | 8:22 AM

జాన్వీ సౌత్ ఎంట్రీ గురించి నార్త్‌లో కూడా చాలా డిస్కషన్ జరుగుతోంది. అందుకే ఈ బ్యూటీ మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారి దేవరకు సంబంధించిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి.

జాన్వీ కూడా ప్రతీ ఇంటర్వ్యూలోనూ తన సౌత్ ఎంట్రీ గురించి గొప్పగా చెబుతున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో జాన్వీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తారన్న ప్రచారం ఎప్పుడో మొదలైంది.

ఎన్టీఆర్ శ్రీదేవి సక్సెస్‌ఫుల్ కాంబో కావటంతో... జూనియర్‌తో జాన్వీ జోడి కడితే.. సౌత్‌లో ఆమెకు గ్రాండ్ వెల్‌కం దక్కుతుందని భావించారు. ఆ అంచనాలతోనే జాన్వీని ఏరి కోరి హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు మేకర్స్.

ఆఫ్ స్క్రీన్ గ్లామర్ ఇమేజ్‌తో రచ్చ చేస్తున్న జాన్వీ, ఆన్ స్క్రీన్ మాత్రం డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు. ఎక్కువగా పర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్సే చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే బీటౌన్‌లో హోమ్లీగా కనిపిస్తున్నా ఇంత వరకు డీగ్లామ్ రోల్ మాత్రం చేయలేదు. టాలీవుడ్ డెబ్యూలో మాత్రం ఆ ప్రయోగం కూడా చేయబోతున్నారు. తాజాగా దేవర ఛాన్స్ గురించి మాట్లాడారు జాన్వీ కపూర్.

వీటితో పాటు ఇప్పుడు పుష్ప 2 స్పెషల్ ఛాన్స్ ఈ భామకే దక్కింది. జూన్ మొదటి వారంలోనే అల్లు అర్జున్, జాన్వీపై స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరగనుందని తెలుస్తుంది.

త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం రానుంది. జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ కంటే టాలీవుడ్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దేవరతో పాటు రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలోనూ ఈమె హీరోయిన్‌గా నటిస్తున్నారు.




