కుమారి శ్రీమతి.. నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి. ఈ సిరీస్ ట్రైలర్‌ను నాచురల్ స్టార్ నాని విడుదల చేసారు. ట్రైలర్‌ని బట్టి చూస్తే, కుమారి శ్రీమతి తన జీవితంలో ఒక బలమైన ఆశయం కోసం ప్రయత్నించే ధైర్య సాహసాలు కలిగిన అమ్మాయిగా నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఈ వెబ్ సిరీస్‌కి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించగా, గోమటేష్ ఉపాధ్యాయే దర్శకత్వం వహించారు.