- Telugu News Photo Gallery Cinema photos Finally Kriti Shetty Got the Chance in Tamil Actor Jayam Ravi pan india project telugu cinema news
Kriti Shetty: ఎట్టకేలకు మరో ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ.. ఆ స్టార్ హీరో సరసన పాన్ ఇండియా మూవీలో కృతి..
'ఉప్పెన'లా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి దూసుకువచ్చింది హీరోయిన్ కృతి శెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో కృతి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో తెలుగు చిత్రపరిశ్రమలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో హిట్స్ అందుకున్న బేబమ్మ.. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్స్ ఖాతాలో వేసుకుంది.
Updated on: Jul 05, 2023 | 6:56 PM

'ఉప్పెన'లా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి దూసుకువచ్చింది హీరోయిన్ కృతి శెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఈ మూవీతో కృతి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో తెలుగు చిత్రపరిశ్రమలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో హిట్స్ అందుకున్న బేబమ్మ.. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్స్ ఖాతాలో వేసుకుంది.

దీంతో తెలుగులో కృతికి ఆఫర్స్ కరువయ్యాయి. ఇటీవల ఆమె నటించిన కస్టడీ చిత్రానికి సైతం మిశ్రమ స్పందన వచ్చింది.

అయితే ప్రస్తుతం కృతి చేతిలో కేవలం ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. చాలా రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది కృతి.

తాజాగా బేబమ్మకు మరో ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి చేయబోతున్న జీని చిత్రంలో ఎంపికయ్యింది బేబమ్మ.

బుధవారం ఈ సినిమా ఓపెనింగ్ అయ్యింది. కృతితోపాటు కళ్యాణి ప్రియదర్శన్, వామికా గబ్బి సైతం నటించనున్నారు. దేవయాని కీలకపాత్ర పోషించనుంది.

ఈ చిత్రానికి అర్జునన్ దర్శకత్వం వహించనున్నాడు.. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై డా. ఐసరి, కె.గణేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.





























